Vaishnavi Kokkura
Vaishnavi Kokkura : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలు, హీరోయిన్స్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లోకి మరో నటి జత చేరింది. పలు యాడ్స్, సీరియల్స్, భీమ్లా నాయక్ తో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వైష్ణవి కొక్కుర ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ఓ ప్రైవేట్ సాంగ్ తో కూడా మెప్పించింది వైష్ణవి.(Vaishnavi Kokkura)
బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. పవన్ కళ్యాణ్ బత్తుల ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి కొక్కురని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.
Also See : Shivani Nagaram : ఇన్నాళ్లు పద్దతిగా.. ఇప్పుడు హాట్ హాట్ ఫోజులతో.. లిటిల్ హార్ట్స్ భామ ఫొటోలు..
ఈ పోస్టర్ లో భార్యాభర్తల మధ్య గొడవ, ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు అన్నట్టు చూపించి పోస్టర్ పై ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా..’ అనే డైలాగ్ పెట్టారు. దీంతో ఈ సినిమాలో వైష్ణవి బాగా ఏడ్చే పాత్ర అని తెలుస్తుంది. భార్యాభర్తల గొడవలు, మగవాళ్ల సమస్యలు ఈ సినిమాలో చూపిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో విషిక, హాసిని సుధీర్ అనే మరో ఇద్దరు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్.. పలువురు కమెడియన్స్ కూడా ఉన్నారు.