Lenin: పెద్ది ఎఫెక్ట్.. అఖిల్ ‘లెనిన్’ సినిమా వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
అఖిల్ అక్కినేని కొత్త సినిమా లెనిన్(Lenin) సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.
Akhil Akkineni Lenin movie postponed Due to Peddi Release.
- పెద్ది వల్ల వాయిదా పడనున్న అఖిల్ ‘లెనిన్’ మూవీ
- జూన్ లో లెనిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం
- త్వరలోనే అధికారిక ప్రకటన
Lenin: అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా లెనిన్. అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే, అఖిల్ కి ఇప్పటివరకు సరైన హిట్ లేదు. అందుకే, లెనిన్ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుడని నమ్ముతున్నారు. అందుకే. లెనిన్(Lenin) సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా థియేటర్స్ లోకి రావాలని కోరుకుంటున్నారు.
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
కానీ, లెనిన్ సినిమా వాయిదా పడటం ఖాయం అని తెలుస్తోంది. దానికి కారణం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా. పెద్ది సినిమాను వాయిదా వేస్తూ అధికారిక ప్రకనట చేశారు మేకర్స్. ఈ సినిమాను ముందుగా మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూశారు. కానీ. అనుకోని కారణాల వల్ల పెద్ది సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నట్టుగా అధికారిక ప్రక్కన చేశారు.
అయితే, అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లెనిన్ సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్.కానీ, ఏప్రిల్ 30న పెద్ది వస్తుంది కాబట్టి లెనిన్ సినిమా వాయిదా పడే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అయితే, కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి, ఈ న్యూస్ ఇపప్టికి మాత్రం రూమర్ గానే ఉంది. చూడాలి మరి ఈ మూవీపై మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారా లేదా అని?
