అక్షరాల పాతిక కోట్ల విరాళమిచ్చిన అక్షయ్
కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా పీఎం కేర్స్ ఫండ్‌కి రూ. 25 కోట్ల విరాళాన్ని అందించిన అక్షయ్ కుమార్..
- sekhar
- Published on- March 28, 2020 / 01:39 PM IST
కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా పీఎం కేర్స్ ఫండ్‌కి రూ. 25 కోట్ల విరాళాన్ని అందించిన అక్షయ్ కుమార్..
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంత భారీగా విరాళం ప్రకటించిన వారు లేరు. తాజాగా అక్షయ్ ప్రకటించిన విరాళంతో.. బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
‘‘ప్రస్తుతం మన ప్రజల జీవితాలని కాపాడుకోవలసిన సమయం ఇది. ఎటువంటి సంఘటనకైనా స్పందించాలి.. మనకి తోచినంత సాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. నా విధిగా పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నాను. ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్లే.. మనల్ని మనం రక్షించుకుందాం’’.. అని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
దీనికి ప్రధాని మోదీ.. అక్షయ్‌ని అభినందిస్తూ.. ‘‘గొప్ప మనసు చాటుకున్నారు..’’ అని ట్వీట్ చేశారు.
