కంగనా కామెంట్స్ ని లైట్ తీసుకున్న ఆలియా

బాలివుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, ఆలియా భట్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఫైర్ బ్రాండ్ కంగనా ఛాన్స్ దొరిగితే చాలు ఆలియాని టార్గెట్ చేసి తన మీద మాటల తూటాలు పేలుస్తుంది. వీళ్ళ మధ్య గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో కంగనా కామెంట్స్ పై ఆలియా స్పందించింది. తన మీద, తన ఫ్యామిలీ మీద కంగనా చేస్తున్న విమర్శల్ని అస్సలు పట్టించుకోనని తన పూర్తి ఫోకస్ యాక్టింగ్ మీదే ఉంటుంది తప్ప విమర్శల మీద కాదని కంగనా కామెంట్స్ కి తన సమాధానం మౌనంగా ఉండటమే అని ఆలియా కామెంట్ చేసింది.
మణికర్ణిక సినిమా టైంలోనే కంగనా, ఆలియా మధ్య విభేదాలొచ్చాయి. మణికర్ణిక డైరెక్టర్ విషయంలో వివాదం చెలరేగినప్పుడు ఆలియా తనకి సపోర్టింగ్ గా మాట్లాడలేదని కంగనా మనసులో పెట్టుకుంది. గతంలో ఆలియా నటించిన రాజీ సినిమా టైంలో సినిమా చూసి ఆలియాని తాను ప్రశంసించానని కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదని మండిపడింది. ఇక అప్పటి నుంచి ఆలియా ని టార్గెట్ చేస్తూనే ఉంది కంగనా.