Allu Arjun: ముంబై షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్.. అది నిజమే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
అల్లు అర్జున్(Allu Arjun) ముంబైలో ఒక లగ్జరీ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు అంటూ క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్.
Allu Aravind Clarifies Reports That Allu Arjun Is Moving to Mumbai
- ముంబై షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్
- అదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
- కేవలం ఒక ఇంటిని మాత్రమే అద్దెకు తీసుకున్నాడట
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మకాంను హైదరాబాద్ నుండి ముంబైకి పూర్తిగా మార్చేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చాలా వరకు ముంబైలోనే షూట్స్ చేస్తున్నాడు. అలాగే, తన నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా బాలీవుడ్ నుంచే ఉండటంతో అక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
Toxic: అప్పుడు తల్లి సెంటిమెంట్.. ఇప్పుడు తండ్రి ఎమోషన్.. యష్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
బన్నీ ఇకపై అక్కడే స్థిరపడతారని, కేవలం షూటింగ్స్ కోసం మాత్రమే హైదరాబాద్ వస్తారన్న వార్తలు అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, ఈ వార్తలపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. “బన్నీ(Allu Arjun) పిల్లల చదువు, కుటుంబం, స్నేహితులు అంతా హైదరాబాద్‌లోనే ఉన్నారని, అన్ని సౌకర్యాలు ఉన్న నగరాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముంబైలో ఇల్లు కొన్నారన్నది అవాస్తవమని, కేవలం షూటింగ్స్ నిమిత్తం తరచుగా వెళ్లాల్సి రావడంతో అక్కడ ఒక లగ్జరీ ఇంటిని అద్దెకు తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు.
దీంతో, గత కొంతకాలంగా వస్తున్న న్యూస్ కి ఎండ్ కార్డు పడింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం తమ హీరో ఎక్కడికి వెళ్లడం లేదని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అల్లు అర్జున్ ముంబైలో ‘రాకా’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సినిమాలో వైవిధ్యమైన లుక్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే బన్నీ, ‘రాకా’లో కూడా తనదైన స్టైల్‌తో భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయబోతున్నారు.
