హైదరాబాద్లో గల్లీ గల్లీలో గణేష్ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. కొంతమంది మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల తర్వాత గణేష్ నిమర్జనం చేస్తున్నారు. మరికొందరు 12 రోజులపాటు ఘణంగా పూజలు చేస్తున్నారు. అయితే తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థలో నెలకొల్పిన వినాయకుడిని నిమజ్జనం చేశారు. నిమజ్జనం కార్యక్రమంలో బన్నీ ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రధారులు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. ఇక అల్లు అరవింద్, రాధాకృష్ణ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.