AAFA: హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
ల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
Allu Arjun Fans Association meeting in Hyderabad.
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం
- భవిషత్తు కార్యాచరణపై చర్చ
AAFA: హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ప్రారంభించారు.
Sadha: సదా అందానికి నెటిజన్స్ ఫిదా.. హాట్ ఫోటోలు వైరల్
ఈ సమావేశంలో.. ఎంపికైన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతలను వివరించారు. చేపట్టిన కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్బంగా.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భవిష్యత్తులో తమ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు.
అలాగే, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు. అల్లు అర్జున్ గారి ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు.
