Allu Arjun – Pushpa 2 : ‘పుష్ప 2’ అయ్యేదాకా వేరే సినిమా గురించి మాట్లాడేదేలే.. హీరోలంతా అలా.. బన్నీ ఇలా..

బన్నీ ఫుల్ ఫోకస్ మొత్తం పుష్ప 2 మీదే పెట్టారు.

Allu Arjun – Pushpa 2 : ‘పుష్ప 2’ అయ్యేదాకా వేరే సినిమా గురించి మాట్లాడేదేలే.. హీరోలంతా అలా.. బన్నీ ఇలా..

Allu Arjun Focus only on Pushpa 2 bunny avoid other Movies

Allu Arjun – Pushpa 2 : అందరు హీరోలు ఆల్రెడీ ఒక సినిమా సెట్స్ మీదుండగానే మరో సినిమా ఓపెనింగ్ చేసుకుని ఎప్పుడు షూట్ స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలైతే ప్యార్లల్ గా 2 సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ 4 సినిమాలు, ఎన్టీఆర్ 3 సినిమాలు, చరణ్ 3 సినిమాలతో కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. వరస సినిమా అనౌన్స్మెంట్లతో, అప్డేట్స్ తో ఫుల్ ఎంగేజ్ చేస్తున్నారు.

మరో వైపు బన్నీ మాత్రం ఒకే సినిమాతో కంటిన్యూ అవుతున్నారు. నిజానికి ఈ నెలలో బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ జరుపుకుంటుందని వార్తలొచ్చాయి. కానీ బన్నీ మాత్రం అసలు వేరే సినిమా ఆలోచనలోనే లేరని తెలుస్తోంది. బన్నీ పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకూ వేరే సినిమా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. అసలు వేరే సినిమా చెయ్యడం కాదు వేరే సినిమా గురించి ఆలోచనే చెయ్యడం లేదన్నారని తెలుస్తోంది.

Also Read : Allu Arjun : ఎన్టీఆర్ బామ్మర్దిని అభినందించిన బన్నీ.. అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్‌ని గమనించారా?

బన్నీ ఫుల్ ఫోకస్ మొత్తం పుష్ప 2 మీదే పెట్టారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చెయ్యాల్సిన టీమ్ ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ చేస్తూనే ఉంది. దీంతో పుష్ప 2 కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యాకే ఫ్రీ మైండ్ తో వేరే సినిమా గురించి ఆలోచించబోతున్నట్టు తెలుస్తోంది.

పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. దాదాపు 3 ఏళ్లనుంచి పుష్ప 2 తోనే బన్నీ ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి పుష్ప రిలీజ్ అయ్యాక గ్యారంటీగా బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది. సో బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఈ సంవత్సరం సెట్స్ మీదకెళ్లే సీన్ లేదని క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, బన్నీకి నేషనల్ అవార్డ్ కూడా రావడంతో పుష్ప 2 మీద ఆల్ ఓవర్ ఇండియా విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. అదీకాక సినిమాలో కరెక్షన్లు, ఓవర్ హైప్ వల్ల ప్రతీ చిన్న డీటెయిల్ ని కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు బద్దలుకొడుతున్నాయి. అందుకే ఈ హైప్ ని అందుకోవడానికే బన్నీ పుష్ప 2 మీదే ఫోకస్ చేస్తున్నారట. ఆ సినిమా అయ్యాకే తన నెక్స్ట్ సినిమా గురించి బన్నీ ఆలోచిస్తారని సన్నిహితులు అంటున్నారు.