బోయపాటిని పరామర్శించిన బన్నీ

దర్శకుడు బోయపాటి శ్రీనుని పరామర్శించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

  • Publish Date - January 25, 2020 / 05:16 AM IST

దర్శకుడు బోయపాటి శ్రీనుని పరామర్శించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి బోయపాటి సీతారావమ్మ(80) గత శుక్రవారం (జనవరి 17) మరణించారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారామె. తల్లి మరణం పట్ల బోయపాటి శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని చేరుకున్నాడు.

పలువురు సినీ ప్రముఖు బోయపాటికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శనివారం (జనవరి 18) ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తదితరులు బోయపాటిని పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన బన్నీ.. బోయపాటిని కలిసి ధైర్యం చెప్పారు.

Read Also : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ దర్శకుడు సుశీంద్రన్

బోయపాటితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా బోయపాటి, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవలే బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ మరణించడంతో అల్లు కుటుంబం విజయవాడ వెళ్లారు. బన్నీ ప్రస్తుతం సుకుమార్‌తో మూడో సినిమా చేస్తుండగా.. బోయపాటి బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా చేయనున్నాడు.