Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ ‘రాకా’ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా? ప్రభాస్ ని మించి..
పుష్ప2 సక్సెస్ తో ఇండియాలోనే మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా సౌత్ టూ నార్త్ పేరు సంపాదించుకున్నారు బన్నీ. (Allu Arjun)
Allu Arjun
Allu Arjun : ఒక్క హిట్ పడితేనే రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు హీరోలు. అలాంటిది స్టార్ హీరో, అందులోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ లో ఉన్న హీరో రెమ్యునరేషన్ పెంచకుండా ఎలా ఉంటారు..? అందుకే బన్నీ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప2 బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా స్టార్ డం తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం చేస్తున్న రాకా సినిమాకి ఇండియాలోనే ఎవరూ తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
పుష్ప2 సక్సెస్ తో ఇండియాలోనే మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా సౌత్ టూ నార్త్ పేరు సంపాదించుకున్నారు బన్నీ. ఆ తర్వాత అట్లీతో రాకా సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చి హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేశారు. రీసెంట్ గా ఆ సినిమా లుక్ తో సరికొత్త హైప్ తెచ్చేశారు. సినిమా కోసం ఫుల్ మేకోవర్ అవుతూ కష్టపడుతున్న బన్నీ ఈ రాకా సినిమాకి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ కంటే ఎక్కువ రెమ్యనరేషన్ తీస్కుంటున్నారని టాక్.
Also Read : Niharika : వరుస హిట్స్ కొడుతున్న యువ హీరో.. కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చిన నిహారిక..
అల్లుఅర్జున్ అట్లీతో చేస్తున్న రాకా సినిమాకు ఏకంగా 175 కోట్లు రెమ్యునరేషన్ తీస్కుంటున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ ఫిక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి బన్నీ ఇప్పటి వరకూ తన కెరీర్ లో తీస్కోనంత రెమ్యునరేషన్ తీస్కుంటున్నారు. ఇప్పటి వరకూ సౌత్ లో ప్రభాస్ మాత్రమే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీస్కుంటున్నారు. సినిమాకి 100 నుంచి 150 కోట్లు తీస్కుంటున్నారు. అయితే రాకా కి మాత్రం బన్నీ 175 కోట్ల రెమ్యునరేషన్ తీస్కోవడంతో మరోసారి వార్తల్లోకొచ్చారు బన్నీ.
అల్లుఅర్జున్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పుష్ప 2కి తీసకున్న రెమ్యునరేషన్ 100 కోట్లు. కానీ మైత్రి మూవీ కాంబినేషన్లో 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప 2కి అల్లుఅర్జున్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2కి అల్లు అర్జున్ కి 100కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ 200 కోట్లు వచ్చాయని మొత్తంగా దాదాపు 300 కోట్లకు పైగా అందినట్టు టాక్. అయితే రాకా సినిమాకి సన్ పిక్చర్స్ నిర్మాతలు కావడంతో ఓన్లీ రెమ్యునరేషనే 175 కోట్లని తెలుస్తోంది. మరి లుక్ వైజ్, యాక్షన్ వైజ్ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్న బన్నీకి ఆ మాత్రం దక్కాల్సిందే అంటున్నారు ఫాన్స్. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
