Aman Masud : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన అయిదవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్షతో వచ్చిన నటుడు అమన్..
అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. (Aman Masud)
Aman Masud
Aman Masud : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా ఆరంభమయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ ఎంట్రీ ఇచ్చింది. .
నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వగా అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. అమన్ నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు. సినిమాల్లో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
Also Read : Sudheer Reddy : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన నాలుగవ కంటెస్టెంట్.. హోస్ట్ సుధీర్ రెడ్డి..
నాగార్జున అమన్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఒక రెడ్ డాట్ ఇచ్చి నీ వెనక వచ్చే ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఎవరికో ఒకరికి పెట్టేయాలి. వాళ్లకు తెలియకూడదు. వాళ్లకు తెలిస్తే నీకు వచ్చే అవకాశం పోతుంది. వాళ్ళు కనిపెట్టకపోతే వాళ్లకు పోతుంది అవకాశం అని తెలిపారు. అలాగే అగ్నిపరీక్షలో చిరిగిపోయిన తన షర్ట్ ఇచ్చి దానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో కనిపెట్టమన్నారు వారం రోజుల్లో.
