Soorarai Pottru
Soorarai Pottru: తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోలలో సూర్య కూడా ఒకరు. ఆయన నటించిన సినిమాలు ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంది. తెలుగులో కూడా స్టార్ హీరోగా వెలుగొందే సూర్య సినిమాకి కూడా ఆ మధ్య కరోనా దెబ్బ పడింది. దక్షణాది భాషల్లో భారీ క్రేజ్ దక్కించుకున్న సూరరై పొట్రు సినిమా కరోనా లాక్ డౌన్ తో ఓటీటీలో విడుదలైంది. తెలుగులో దీన్ని ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదల చేశారు.
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైన ఆకాశం నీ హద్దురా సినిమా మంచి అప్లాజ్ దక్కించుకొని భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలైనా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. కాగా, ఇప్పుడు ఈ సినిమాను మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రశంసించారు. ఈ సినిమాను చూసిన బిగ్ బీ ఈ సినిమాలోని అందని ఆకాశం దించవయ్యా మాకోసం అనే పాట వింటూ కంటతడి పెట్టానని చెప్పారు. ఈ పాటలో గుండెను పిండేసే భావోద్వేగం ఉందని తన బ్లాగ్‌లో రాశారు.
అమితాబ్ స్పందించిన తీరుకి ఆకాశం నీ హద్దురా సినిమా బృందం ధన్యవాదాలు తెలుపగా హీరో సూర్య బిగ్ బీ ప్రశంసలపై ఎమోషన్ అయ్యాడు. ఇలాంటి అద్భుతమైన మాటలు, ప్రశంసలు లాంటివే తన సినిమా సూరారై పోట్రుకి గ్రేటెస్ట్ రివార్డులని పేర్కొన్న సూర్య.. మీ మాటలు తన మనసుని తాకాయని ఎమోషనల్ గా స్పందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.