Oke Oka Jeevitham : ‘అమ్మా.. నే కొలిచే శారదవే.. నిత్యం నను నడిపే సారథివే’.. సిరివెన్నెలకే సాధ్యం..
సిరివెన్నెల సీతారామ శాస్త్రి అమ్మగొప్పదనాన్ని తెలియజేస్తూ భావోద్వేగభరితమైన పదాలు రాశారు..
- sekhar
- Published on- January 27, 2022 / 12:57 PM IST
Amma Song
Oke Oka Jeevitham: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్, రీతు వర్మ జంటగా నటిస్తున్న సినిమా.. ‘ఒకే ఒక జీవితం’.. శ్రీ కార్తిక్ దర్శకుడిగా చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నారు.
Oke Oka Jeevitham : జీవితానికి, టైం మిషన్కి సంబంధం ఏంటి?
కొంత గ్యాప్ తర్వాత సీనియర్ నటి అమల అక్కినేని ఈ సినిమాలో శర్వా తల్లిగా నటిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ‘అమ్మ సాంగ్’ రిలీజ్ చేశారు. ఈ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాయడం విశేషం. ‘ప్రతి మెతుకూ నా బ్రతుకనిపించేలా.. నువ్వుంటేనే నేను.. నువ్వంటేనే నేను.. అనుకోలేకపోతే ఏమైపోతాను’.. అంటూ అమ్మగొప్పదనాన్ని తెలియజేస్తూ భావోద్వేగభరితమైన పదాలు రాశారు.
జేక్స్ బిజోయ్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ చక్కటి ఫీల్‌తో పాడారు. ఈ మూవీ తమిళ్లో ‘కణం’ పేరుతో తెరకెక్కుతోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. టైం మిషన్ కాన్సెప్ట్‌తో, సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. థ్రిల్‌కి గురిచేసే అంశాలతో పాటు లవ్, చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుందని ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ చూస్తే తెలుస్తోంది.
