Ananya Nagalla: నాగశౌర్య నా ఫస్ట్ క్రష్.. మనసులో మాట చెప్పిన అనన్య నాగళ్ళ.. కాబోయే వాడు అలాగే ఉండాలట
టాలీవుడ్ హీరో నాగ శౌర్య గురించి తన మనసులో మాట చెప్పిన క్రేజీ బ్యూటీ అనన్య నాగళ్ళ(Ananya Nagalla).
Ananya Nagalla declaring that hero Naga Shaurya is her first crush
- అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్.
- హీరో నాగశౌర్యపై మనసు పడ్డారు.
- పెళ్లిపై అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు.
Ananya Nagalla: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల(Ananya Nagalla). సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించి, నటనపై మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేసిన ఈ తెలుగమ్మాయి, ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రంలో సహజసిద్ధమైన నటనతో మెప్పించిన అనన్యకు, పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ ఇచ్చింది. అతి తక్కువ కాలంలోనే గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ కార్మికుడు మృతి
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ, టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ఫస్ట్ క్రష్ అని అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్నతనం నుండి మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఇష్టంగా చూసేదానినని, కానీ క్రష్ విషయంలో మాత్రం నాగశౌర్య పేరునే ప్రస్తావించింది. తన వివాహం, కాబోయేవాడి గురించి మాట్లాడుతూ.. తనకు కాబోయే వాడు చాలా నిజాయితీగా ఉండాలని, ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. అయితే సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో రిలేషన్ అంటే తనకు కొంత భయం అని ఆమె అభిప్రాయపడింది.
సినీ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లపై స్పందిస్తూ, తనకు ఇప్పటివరకు ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని అనన్య స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ లేదా కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోనని, కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెడతానని తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్ నుండి బిగ్ స్క్రీన్ వరకు ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, అటు గ్లామర్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది.
