NCB Enquiry: సినిమా ఆఫీస్ కాదు లేటుగా రావడానికి అంటూ అనన్య పాండేపై సీరియస్
ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అయినందుకు అనన్య ఇంటికెళ్లడంతో పాటు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఫ్రెండ్ అయిన అనన్య మీద పోలీసులు ఓ కన్నేశారు.
- Subhan Ali Shaik
- Published On : October 23, 2021 / 02:00 PM IST
Ananya Pandya
NCB Enquiry: ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అయినందుకు అనన్య ఇంటికెళ్లడంతో పాటు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఫ్రెండ్ అయిన అనన్య మీద పోలీసులు ఓ కన్నేశారు. అసలు ఎంక్వైరీ సమయానికి హాజరుకాకుండా మూడు గంటలు లేట్ చేసిందట అనన్య. దానిపై మండిపడ్డ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే తిట్టిపోశారట..
శుక్రవారం ఉదయం 11గంటల సమయానికి హాజరుకావాలని చెప్పడం, ఆమె లేటుగా రావడంపై మండిపడ్డారు. సెకండ్ రౌండ్ విచారణలో భాగంగా ఆఫీసుకురావాలని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వచ్చిందని.. ఇది ప్రొడక్షన్ హౌజ్ కాదు. సెంట్రల్ ఏజెన్సీ ఆఫీస్ అని సీరియస్ అయ్యారట.
ఆ తర్వాత ఆమెను నాలుగు గంటపాటు విచారించి ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో ఏమైనా సంబంధాలున్నాయా అని ఆరా తీస్తున్నారు. ఆమె ల్యాప్ టాప్ తో పాటు, మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనపరచుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఆర్యన్ ఖాన్ తో జరిపిన టెక్స్ట్ ఛాట్స్ అన్ని రిట్రీవ్ చేశారు. ఆర్యన్ .. అనన్యతో గంజాయి గురించి అడిగేసరికి ఏర్పాటు చేస్తానని చెప్పినట్లుగా అందులో ఉంది.
…………………………………. : నల్లజామతో…వృద్ధాప్య ఛాయలకు చెక్..
ఏమైనా దొరుకుతుందా అని అడిగిన దానికి.. అరేంజ్ చేస్తానని అనన్య పాండే రిప్లై ఇచ్చింది. ఆ చాటింగ్ హిస్టరీ చూపించి ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. వాటిపై స్పందించిన అనన్య.. తాను కేవలం జోక్ మాత్రమే చేశానని బదులిచ్చింది. గురువారం, శుక్రవారం మొత్తం 2సార్లు విచారణకు హాజరైంది అనన్య పాండే.
మూడో రౌండ్ విచారణలో భాగంగా సోమవారం కూడా హాజరవ్వాలని ఆదేశించారు ఎన్సీబీ అధికారులు.
