Mega Family : మెగా కోడళ్ళు, ఆడపడుచులు అంతా ఒకే చోట.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన పవన్ భార్య..
తాజాగా అన్నా లెజినోవా మెగా లేడీస్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసింది. (Mega Family)
Mega Family
Mega Family : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో అధికారికంగా ఎంట్రీ ఇచ్చి రెగ్యులర్ గా ఆసక్తికర పోస్టులు చేస్తుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది అన్నా లెజినోవా.
దీంతో మెగా ఫ్యాన్స్ ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అయి ఈమె షేర్ చేసే ఫోటోలను వైరల్ చేస్తున్నారు. తాజాగా అన్నా లెజినోవా మెగా లేడీస్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసింది.
Also Read : Nithiin : వరుస ఫ్లాప్స్ వచ్చినా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టిన నితిన్..
ఈ ఫొటోలో చిరంజీవి తల్లి అంజనా దేవి, చిరంజీవి భార్య సురేఖ, నాగబాబు భార్య పద్మజ, అన్నా లెజినోవా, చిరంజీవి చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు ఉన్నారు. మెగా ఫ్యామిలిలో జరిగిన ఓ ఫంక్షన్ టైంలో ఈ ఫోటో దిగినట్టు ఉన్నారు. అన్నా లెజినోవా షేర్ చేసిన ఈ ఫొటోలో మెగా కోడళ్ళు, ఆడపడుచులు అంతా ఒకే ఫొటోలో ఉండటంతో ఇది వైరల్ గా మారింది.

