Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ తన ఇంటికి ఏం పేరు పెట్టుకుందో తెలుసా? సొంతిల్లు బ్యాక్ స్టోరీ..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన సొంతింటి గురించి మాట్లాడింది. (Anupama Parameswaran)
Anupama Parameswaran
Anupama Parameswaran : మలయాళ కుట్టి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వరుసగా తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది అనుపమ. ఇటీవలే క్రేజీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుపమ పరమేశ్వరన్.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన సొంతింటి గురించి మాట్లాడింది.
Also See : Satya Sri : పోలీస్ డ్రెస్లో జబర్దస్త్ సత్యశ్రీ.. నా వైఫ్ మిస్సింగ్ వర్కింగ్ స్టిల్స్..
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఆ ఊళ్ళో, ఆ ప్లేస్ లోనే నేను పుట్టి పెరిగాను. మా నాన్న కూడా అక్కడే పుట్టారు. మా అమ్మ కూడా ఆ దగ్గర్లోనే. మాది లోయర్ మిడిల్ క్లాస్. నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకున్నాను. ప్రేమమ్ సినిమాతో వచ్చిన నా మొదటి సంపాదన డబ్బుతో నా ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేశాను. ఆ సినిమాతో అప్పుడు నా లైఫ్ మారిపోయింది. అప్పుడు నేను పుట్టిన చోట నాలుగున్నర సెంట్లు స్థలం కొనుక్కున్నాను. అందులో ఇల్లు కట్టుకున్నాను. దానంతటికి కారణం ప్రేమమ్ సినిమానే. 2017లో ఆ ఇల్లు పూర్తయింది. ప్రేమమ్ వల్లే నా జీవితం మారి సొంత ఇల్లు కట్టుకున్నాను కాబట్టి నా ఇంటికి ప్రేమమ్ అనే పేరు పెట్టుకున్నాను అని తెలిపింది.
అనుపమ పరమేశ్వరన్ ఇంటి బయట ప్రేమమ్ అని మలయాళ అక్షరాలతో ఉంటుంది. ప్రేమమ్ సినిమా టైటిల్ డిజైన్ లోనే తన ఇంటిపై ఆ పేరు పెట్టుకోవడం గమనార్హం. తనకు లైఫ్ ఇచ్చిన సినిమాని అనుపమ పరమేశ్వరన్ ఇంతగా గుర్తుంచుకుంది.

