AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. ‘పెద్ది’ వేదికపై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చిరంజీవి, రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్(AR Rahman).
AR Rahman makes interesting comments about Chiranjeevi and Ram Charan.
- రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదల
- చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టిన రామ్ చరణ్
- కథలోని మట్టి వాసన నచ్చింది: రెహమాన్
AR Rahman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతకంటే ముందుగానే, అంటే జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా ప్లాన్ చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది.
Rasha Thadani: శ్రీనివాస మంగాపురం హీరోయిన్ రాశా టడాని.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తార.. ఫొటోలు
ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో ఆస్కార్ విన్నర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ నటుడి వారసత్వాన్ని అందుకోవడం, ఆయన స్థాయికి తగ్గట్టుగా రాణించడం ఎంత కష్టమో రెహమాన్ గుర్తుచేశారు. అయితే రామ్ చరణ్ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్, ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని ప్రశంసించారు. తన కుమారుడు కూడా చరణ్ లాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న రెహమాన్.. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న పరిశ్రమలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. బుచ్చిబాబు సానా ఈ సినిమా కథను వివరించినప్పుడు అందులోని మట్టి వాసన, స్ఫూర్తిదాయకమైన కథాంశం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం అందించడాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేశానని, ఖచ్చితంగా ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
