Shivam Bhaje : ‘శివం భజే’ మూవీ రివ్యూ.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..

శివం భజే సినిమా థ్రిల్లర్ అయినా చాలా కొత్త పాయింట్ తో తెరకెక్కించారు.

Shivam Bhaje : ‘శివం భజే’ మూవీ రివ్యూ.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..

Ashwin Babu Digangana Suryavanshi Shivam Bhaje Movie Review and Rating

Shivam Bhaje Movie Review : అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా తెరకెక్కిన సినిమా ‘శివం భజే’. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ‘శివం భజే’ సినిమా నేడు ఆగస్టు 1న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.

కథ విషయానికొస్తే.. చందు(అశ్విన్ బాబు) ఓ లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి దేవుడ్ని నమ్మడం మానేస్తాడు. లోన్ రికవరీ ప్రాసెస్ లో ఫార్మాసూటికల్ ల్యాబ్ లో పనిచేసే శైలజ(దిగంగన సూర్యవంశీ) పరిచయమయి అనంతరం ప్రేమలో పడతారు. లోన్ రికవరీలో భాగంగా ఒకరితో గొడవ జరగడంతో ఆ గొడవలో చందు కళ్ళు పోతాయి. అయితే అదే సమయానికి ఎవరికో యాక్సిడెంట్ అయిందని వాళ్ళ కళ్ళు తీసుకొచ్చి చందుకు అమరుస్తారు.

ఆ కళ్ళు అమర్చిన దగ్గర్నుంచి చందుకు యేవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన డైలీ లైఫ్ లో మార్పులు వస్తూ ఉంటాయి. దేవుడికి దండం పెట్టడం మొదలుపెడతారు. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో మొదట పట్టించుకోరు. వేరే డాక్టర్ చందుని పరిశీలించి ఆపరేషన్ లో చందుకు కుక్క కళ్ళు అమర్చారని చెప్తాడు. అయితే అవి పోలీస్ ట్రైనింగ్ కుక్క డోగ్రె కళ్ళు అని తెలుస్తుంది. మరో వైపు చైనా పాకిస్థాన్ కలిసి ఇండియాని నాశనం చేయాలని ఓ కుట్ర పన్నుతుంటారు. మరో వైపు వరుసగా కొంతమంది చనిపోతూ ఉంటారు. అసలు ఆ కుక్క కథ ఏంటి? కుక్క కళ్ళు చందుకు ఎలా అమర్చారు? సీరియల్ కిల్లర్ ఎవరు? చైనా పాకిస్థాన్ చేసే ప్లాన్ ఏంటి? అసలు చందుకి శివుడికి, ఆ చైనా ప్లాన్ కి లింక్ ఏంటి? చనిపోయేవాళ్లు ఎవరు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఇటీవల థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. శివం భజే సినిమా థ్రిల్లర్ అయినా చాలా కొత్త పాయింట్ తో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ ప్రేమ, హీరో గురించి సాగుతూ సింపుల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు హీరోకి కుక్క కళ్ళు అమర్చారు అని రివీల్ చేసి నెక్స్ట్ ఏంటి? ఏ కుక్క? శివుడుకు చందుకు లింక్ ఏంటి అని ఆసక్తి కలుగుతుంది. సెకండ్ హాఫ్ ఆ కుక్క గురించి, పోలీస్ ఇన్వెస్టిగేషన్, హీరోకి కుక్క జ్ఞాపకాలు రావడం, శివుడు విజువల్స్.. ఇలా చాలా ఆసక్తిగా సాగుతుంది. స్క్రీన్ ప్లేని చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొదట్లో కొంచెం బోర్ కొట్టినా ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది.

హీరో క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నాడు డైరెక్టర్. మొదట్నుంచి కుక్కలు అంటే ఇష్టం లేని హీరోకి కుక్క కళ్ళు అమర్చడంతో పాటు సెకండ్ హాఫ్ లో కుక్కలతో వచ్చే సీన్స్ అన్ని అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ లో చూపించే శివుడి విజువల్స్ కోసం అయినా ఈ సినిమాని థియేటర్లో చూడాలి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రశ్నలు అన్నిటికి సెకండ్ హాఫ్ లో సమాధానాలు ఒక్కొక్కటిగా రివీల్ చేసి ఆసక్తిగా తెరకెక్కించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. అశ్విన్ బాబు ఇప్పటికే థ్రిల్లర్ సినిమాల్లో అదరగొట్టాడు. మొదట్నుంచి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్న అశ్విన్ బాబు ఈ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్ ఫైట్ లో అయితే అశ్విన్ నటన ఓ రేంజ్ లో ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పిస్తాడు. ఇక హీరోయిన్ దిగంగన సూర్యవంశీ కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. పోలీసాఫీసర్ గా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ బాగానే మెప్పించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో ఆది నవ్విస్తాడు. ఇనయా సుల్తానా, తులసి, మురళి శర్మ, బ్రహ్మాజీ.. ఇలా మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే డోగ్రె కుక్క, మరికొన్ని కుక్కలు కూడా బాగా నటించాయి.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ ప్రేక్షకులని మెప్పించేలా దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక శివుడి విజువల్స్ బాగా చూపించాడు. డైరెక్టర్ అప్సర్ ముస్లిం అయినా కథలో శివుడి తత్వాన్ని, శివుడి విజువల్స్ ని అద్భుతంగా చూపించారు. ఇందుకు డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు. దర్శకుడిగా అప్సర్ అదరగొట్టాడని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు యావరేజ్ అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగుంటాయి. ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కథలో ఎక్కడా బోర్ కొట్టకుండా చేసారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘శివం భజే’ సినిమా శివుడి ఓ మనిషికి అనుకోకుండా కుక్క కళ్ళు అమరిస్తే ఏం జరిగింది, సృష్టిలో ఏం జరిగినా శివుడి ఆజ్ఞే అని చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.