Ramnagar Bunny : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మళ్ళీ వచ్చేసాడు.. ‘రామ్ నగర్ బన్నీ’ గ్లింప్స్ రిలీజ్..

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమా 'రామ్ నగర్ బన్నీ' టైటిల్ లాంచ్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Ramnagar Bunny : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మళ్ళీ వచ్చేసాడు.. ‘రామ్ నగర్ బన్నీ’ గ్లింప్స్ రిలీజ్..

Attitude Star Chandrahass Ramnagar Bunny Movie Glimpse Released

Ramnagar Bunny : బుల్లితెర మెగాస్టార్ ఈటీవి ప్రభాకర్ సీరియల్స్ తో, సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ ఎదిగారు ప్రభాకర్. అయితే ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం చేస్తూ గతంలో ఓ సినిమాని అనౌన్స్ చేసారు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ నిల్చునే విధానం, మాట్లాడే విధానం బాగా వైరల్ అయి సోషల్ మీడియాలో ఆటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చేసింది.

ఆ ట్రోల్స్ ని పాజిటివ్ గా తీసుకొని అదే ఆటిట్యూడ్ స్టార్ ని తన ట్యాగ్ గా మార్చుకొని చంద్రహాస్ తన మొదటి సినిమాతో రాబోతున్నాడు. తన మొదటి సినిమా ప్రమోషన్స్ లో ఆటిట్యూడ్ స్టార్ అని తన పేరు ముందు వేసుకోవడం గమనార్హం. నేడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ టైటిల్ లాంచ్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Also Read : Deepika Padukone : పండంటి పాపాయికి జన్మనిచ్చిన దీపికా పదుకోన్..

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మాణంలో శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ జరగ్గా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీరు కూడా రామ్ నగర్ బన్నీ గ్లింప్స్ చూసేయండి..

ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది రామ్ నగర్ బన్నీ సినిమా. ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఇక ఈ ఈవెంట్లో వరద బాధితుల సహాయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ఆర్థిక సహాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అందచేసాడు చంద్రహాస్.

ఈ గ్లింప్స్ ఈవెంట్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభాకర్ నాకు చాలా సన్నిహితులు. ఈ రామ్ నగర్ బన్నీ సినిమా గురించి చెప్పి నన్ను ఇన్వైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. చంద్రహాస్ మా అమ్మాయి క్లాస్ మేట్ కూడా. తెలంగాణలో వరద బాధితుల కోసం చంద్రహాస్ తన వంతు సహాయాన్ని అందించడం సంతోషం. మొదటి సినిమాతోనే చంద్రహాస్ ఆకట్టుకుంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అతన్ని ఆదరించాలి అని అన్నారు.

Attitude Star Chandrahass Ramnagar Bunny Movie Glimpse Released

ఇక ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు అని ట్రోల్ చేసారు. నేను సినిమాల్లో ఒకలా, బయట ఇంకోలా ఉండను. నేను కొందరికి నచ్చలేదు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే కోరికతో హీరోగా మారాను. మా నాన్న ప్రభాకర్ గారి పేరు నిలబెడతాను. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. రామ్ నగర్ బన్నీ నా మొదటి సినిమాగా రాబోతోంది. అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇకపై రెగ్యులర్ గా మా మూవీ అప్డేట్స్ ఇస్తాం. ఈ సినిమా కలెక్షన్స్ లో 10 శాతం కూడా వరద బాధితుల సహాయం కోసం అందిస్తాం. భవిష్యత్ లో కూడా నాకు తోచినంత సహాయం సమాజం కోసం చేస్తాను అని అన్నాడు. దీంతో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మరోసారి వైరల్ అవుతున్నాడు. మరి రామ్ నగర్ బన్నీ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Chandra Hass (@chandrahass8)