Che Movie Trailer : చేగువేరా బయోపిక్ “చే” మూవీ ట్రైలర్ చూశారా.. పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసిన ఈ కథ..

తెలుగు ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ ద్వారా క్యూబా పోరాటయోధుడు చేగువేరా గురించి కొంతమేర తెలుసు. ఇప్పుడు ఆయన జీవిత కథని..

Che Movie Trailer : చేగువేరా బయోపిక్ “చే” మూవీ ట్రైలర్ చూశారా.. పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసిన ఈ కథ..

B R Sabhavath Nayak Che Long Live Movie Trailer released

Che Movie Trailer : తెలుగు ఆడియన్స్ క్యూబా పోరాటయోధుడు చేగువేరా గురించి ఒక ఐడియా ఉందంటే.. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలనే అని చెప్పొచ్చు. పవన్ అభిమానించే ఆ వ్యక్తి ఎవరు అని ఆడియన్స్ తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ యోధుడి జీవిత చరిత్రని తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా చూపేందుకు.. బీఆర్ సభావత్ నాయక్ “చే” అనే మూవీని తీసుకు వస్తున్నారు. లాంగ్ లైవ్ అనేది మూవీ ట్యాగ్ లైన్. చేగువేరా బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూనే దర్శకత్వం కూడా వహించారు.

క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వస్తుంది. మరి ఆ ట్రైలర్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Allu Arjun : అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ చూశారా..?

ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్టుప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెన్సార్ కు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు బి.ఆర్ సభావత్ నాయక్ తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటిస్తామంటూ వెల్లడించారు.