బోయపాటిని పరామర్శించిన బాలయ్య

దర్శకుడు బోయపాటి శ్రీనుని పరామర్శించిన నందమూరి బాలకృష్ణ..

  • Publish Date - January 23, 2020 / 07:19 AM IST

దర్శకుడు బోయపాటి శ్రీనుని పరామర్శించిన నందమూరి బాలకృష్ణ..

దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి బోయపాటి సీతారావమ్మ(80) గత శుక్రవారం (జనవరి 17) మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంనుంచి అస్వస్థతతో బాధపడుతున్నారామె. తల్లి మరణం పట్ల బోయపాటి శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని చేరుకున్నాడు. పలువురు సినీ ప్రముఖు బోయపాటికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

శనివారం (జనవరి 18) ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నారా లోకేష్ బోయపాటిని పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటిని పరామర్శించారు.

Read Also : హాస్పిటల్‌లో చేరిన సునీల్ – ఆందోళనలో అభిమానులు

పెదకాకానిలోని బోయపాటి నివాసానికి వెళ్లిన బాలయ్య.. సీతారావమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బోయపాటికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలయ్య, బోయపాటి కలయికలో రూపొందనున్న హ్యాట్రిక్ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.