Balakrishna-Sandeep Reddy : బాలయ్య, సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా?
Balakrishna-Sandeep Reddy : సందీప్‌రెడ్డి వంగా, బాలయ్య కాంబోలో సినిమా అంటూ కొత్త టాక్ మొదలైంది.
Balakrishna - Sandeep Reddy Vanga Movie Update
Balakrishna – Sandeep Reddy : రోల్ ఏదైనా సీన్ మరేదైనా బాలయ్య స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్స్ మారుమోగిపోవాల్సిందే. డిక్టేటర్‌గా అయినా అఖండగా రెచ్చిపోయినా బాలయ్య సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ పక్కా. సినిమా ఏదైనా బాలయ్యదే ఆల్ రౌండ్ షో ఉంటుంది. అలాంటిది బాలయ్య ఓ డేరింగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సందీప్‌రెడ్డి వంగా.
సందీప్‌రెడ్డి వంగా, బాలయ్య కాంబోలో సినిమా అంటూ కొత్త టాక్ మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్లో దర్శకుల కాంబినేషన్లపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బాలయ్యతో సందీప్ రెడ్డి వంగా సినిమా అనే టాక్ ఆసక్తిని పెంచుతోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్, ఆయన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు సందీప్ వంగా మార్క్ మేకింగ్ తోడైతే ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందోననే చర్చ అభిమానుల్లో అంచనాలు మొదయల్యాయి.
RC 17 : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. RC17 షూటింగ్ డేట్ ఖరారు!
ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉంటుంది. హీరో రోల్, ఇంటెన్స్ ఎమోషన్స్, బోల్డ్ టేకింగ్, రా అండ్ రస్టిక్ యాక్షన్ ఆయన సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్. అలాంటి దర్శకుడు బాలకృష్ణను తనదైన శైలిలో ప్రెజెంట్ చేస్తే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. బాలయ్యలోని మాస్ యాంగిల్‌తో పాటు ఎమోషనల్ షేడ్స్‌ను కూడా వంగా కొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉందనే చర్చ స్టార్ట్ అయింది.
అయితే బాలయ్య, సందీప్‌రెడ్డి వంగా కాంబోపై అధికారిక ప్రకటనేం రాలేదు. కానీ వాళ్లిద్దరి కాంబినేషన్లో సినిమాలో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మాత్రం ఆసక్తికరంగా మారింది. నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ కార్యరూపం దాలిస్తే మాత్రం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా పిక్చర్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
