Mokshagna Nandamuri : ‘విశ్వంభర’ రిలీజ్ చెయ్యకుండా.. బాలయ్య కొడుకుతో సినిమా అనౌన్స్ చేసిన దర్శకుడు..
ఇలాంటి సమయంలో డైరెక్టర్ వశిష్ఠ కొత్త సినిమా ప్రకటించాడు. (Mokshagna Nandamuri)
Mokshagna Nandamuri
Mokshagna Nandamuri : డైరెక్టర్ వశిష్ఠ బింబిసారా సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్నాడు. దాంతో మెగాస్టార్ పిలిచి ఛాన్స్ ఇవ్వడంతో విశ్వంభర సినిమా తీశారు. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక అనేక విమర్శలు వచ్చాయి. దాంతో విశ్వంభర సినిమాకు నాగ్ అశ్విన్ సహాయం కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. చాలా రోజులుగా విశ్వంభర సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీదు.
ఇలాంటి సమయంలో డైరెక్టర్ వశిష్ఠ కొత్త సినిమా ప్రకటించాడు. ఎప్పట్నుంచో నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఇప్పుడు వశిష్ఠ తో అవ్వబోతుంది. మోక్షజ్ఞ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వశిష్ఠ దర్శకత్వంలో నేడు సినిమాని ప్రకటించారు. నేడు మోక్షజ్ఞ నందమూరి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.
Also Read : NBK 111 : నాగార్జున 100వ సినిమా పై పోటీకి బాలయ్య.. NBK 111 టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్..
అయితే గతంలో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా అని ప్రకటించి పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. మరి ఆ సినిమా ఉందో ఆగిపోయిందో క్లారిటీ రావాలి.

