Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు..? ఎక్కడ..?

థియేటర్స్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న భగవంత్ కేసరి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమా ఎప్పుడు..? ఎక్కడ..? రిలీజ్ కాబోతుంది.

Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు..? ఎక్కడ..?

Balakrishna Sreeleela Bhagavanth Kesari OTT release date update

Bhagavanth Kesari OTT Release : బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ ఏడాది దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద 135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఇక థియేటర్స్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమా ఎప్పుడు..? ఎక్కడ..? రిలీజ్ కాబోతుంది.

ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాబోతుంది. నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఒకవేళ థియేటర్ లో ఈ సినిమాని మిస్ అయిన వారు ఉంటే.. ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో మహిళా శక్తి గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేశారు. ఇక మూవీలోని శ్రీలీల, బాలయ్య మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ గుండెకు హత్తుకునేలా ఉంటాయి. థమన్ ఈ సినిమాకి అదిరిపోయే సంగీతం అందించారు.

Also read : Mahesh Babu : మహేష్ బాబు స్పెషల్ పోస్ట్.. ప్రతి క్షణం వారితో ఆస్వాదించడం..

ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న NBK109 సినిమా విషయానికి వస్తే.. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఊటీలో జరుగుతుంది. బాలయ్యతో యాక్షన్ షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో హీరో దుల్కర్ సల్మాన్ కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.