Ashu Reddy : పేరు మార్చుకున్న అషురెడ్డి.. ఇప్పుడైనా కలిసొస్తుందా?
రీల్స్, సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ సాధించింది.

Bigg Boss Fame Ashu Reddy Changed her Name with Adding a Letter
Ashu Reddy : చాలా మంది కలిసిరావాలనో లేదా మరేదో కారణాలతోనో పేరు మార్చుకుంటారు. లేదా పేరులో ఒక అక్షరం చేర్చడమో, తీసేయడమో చేస్తుంటారు. మన సెలబ్రిటీలు కూడా ఇప్పటికే చాలా మంది తమ పేర్లలో ఎక్స్ ట్రా అక్షరాలు చేర్చుకున్నారు. తాజాగా అషురెడ్డి తన ఇంగ్లీష్ పేరులో ఒక లెటర్ చేర్చుకుంది. రీల్స్, సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి మరింత ఫేమ్ సాధించింది.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్, టీవీ షోలు, యాంకర్ గా, నటిగా.. ఇలా ఏ అవకాశం వస్తే అది చేసుకుంటూ వెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇలా ఏదో ఒకటి చేస్తూ యాక్టివ్ గా ఉంటున్నా అషురెడ్డి హీరోయిన్ అవ్వాలని, పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలని గట్టిగానే ట్రై చేస్తుంది. కానీ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు.
Also Read : Ashu Reddy : అషురెడ్డి అందాల జాతర..
కెరీర్ లో ఇంకా ఎదగడానికి గతంలో వేణుస్వామితో పూజలు చేయించింది కూడా. మరి ఆ పూజల ఫలితం ఏమైందో కానీ తాజాగా అయితే తన ఇంగ్లీష్ పేరులో ఒక లెటర్ చేర్చింది. గతంలో తన పేరుని ఇంగ్లీష్ లో Ashu Reddy అని రాసేది. ఇప్పుడు Aashu Reddy అని రాస్తుంది. తన సోషల్ మీడియాలో ఇలా పేరుని మార్చింది. ఇన్నాళ్లు అషురెడ్డి అని పిలవగా ఇప్పుడు ఆషురెడ్డి అని పిలవలేమో మరి. ఇలా పేరులో లెటర్ చేర్చుకోమని ఎవరు చెప్పారో?. పూజలు చేయడం, హాట్ హాట్ ఫోటోలు పెట్టడం, ఇప్పుడు పేరు మార్చుకోవడం.. ఇన్ని చేసినా అషురెడ్డి హీరోయిన్ అవుతుందా? కెరీర్ లో ఇంకా ఎదుగుతుందా చూడాలి.