Bigg Boss Telugu 10 Contestants : సీజన్ 10లో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది వీళ్లేనా?
Bigg Boss Telugu 10 Contestants: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 10 ఆదివారం (సెప్టెంబర్ 6న) నుంచి ప్రారంభం కానుంది.
Bigg Boss Telugu 10 contestants list viral on social media
Bigg Boss Telugu 10 Contestants : బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 10 ఆదివారం (సెప్టెంబర్ 6న) నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ అక్కినేని నాగార్జున్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అగ్ని పరీక్ష కార్యక్రమం ద్వారా సామాన్యులు బిగ్ బాస్‌లోకి రానున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీరేనంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నాయి.
యాంకర్ వర్షిణి సౌందరరాజన్, జబర్దస్త్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, నరేష్, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, ఆదిత్ ఈశ్వరన్ సీరియల్ నటులు ముఖేష్ గౌడ, దేబ్జానీ మోదక్, చైత్రా రాయ్ సెలబ్రెటీలుగా హౌస్‌లో అడుగుపెట్టనున్నారని ప్రచారం సాగుతోంది.
Read Also – Jabardasth Rakesh : మా ఇంటి కృష్ణుడు.. జబర్దస్త్ రాకేష్ ఫోటోలు వైరల్.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా..
అగ్ని పరీక్ష సీజన్ 2 సామాన్యులుగా కొందరు వెళ్లనున్నారు. సింగర్ ఝాన్సీ, రోహిత్ నాయుడు, షాలిని, చరణ్, రామకృష్ణ లు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరి వీరిలో ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారో తెలియాలంటే రేపటి(ఆదివారం) వరకు ఆగక తప్పదు.
