Krishnudu Bigg Boss Remuneration: ‘కృష్ణుడు’ ఎలిమినేట్.. రెండు వారాలకు ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?
Krishnudu Bigg Boss Remuneration: అనుకున్నట్టే నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు.
Bigg Boss Telugu 10 Krishnudu Two Weeks Remuneration
Krishnudu Bigg Boss Remuneration : ఈసారి జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి ఊహించని విధంగా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్ గా, హీరోగా ఒకప్పుడు పలు సినిమాలతో మెప్పించిన కృష్ణుడు మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని ఇటీవలే సినిమాలు మళ్ళీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని ఊహించారు.
కానీ మొదటి వారం సరదాగా, ఫైర్ తో ఉన్న కృష్ణుడు రెండోవారం సైలెంట్ అయిపోయాడు. అసలు ఏ పని చేయకుండా, ఏ యాక్టివిటీలో పాల్గొనకుండా ఉండటంతో కృష్ణుడుని ఎవరూ పట్టించుకోలేదు. ముందు నుంచే కృష్ణుడు ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. అనుకున్నట్టే నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడు.
Also See : రాజమౌళి ఫ్యామిలీతో ఫహద్ ఫాజిల్ వినాయక చవితి సెలబ్రేషన్స్.. స్పెషల్ ఇంటర్వ్యూ వైరల్..
కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తూ.. నేను ముందే చెప్పాను నేనే వెళ్ళిపోతాను అని. నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను. హెల్త్ సమస్యలు కూడా ఉన్నాయి. షుగర్ తగ్గింది. అది ఎఫెక్ట్ అయింది అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. బయటకు రాగానే నిన్న రాత్రి ప్రెస్ మీట్ కూడా నిర్వహించి మీడియాతో మాట్లాడాడు. అయితే కృష్ణుడికి రెండు వారాలకు గాను వారానికి 2 లక్షల చొప్పున రెండు వారాలకు నాలుగు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే బిగ్ బాస్ కి వచ్చిన కృష్ణుడికి ఇకపై సినిమాల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
