Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ హౌస్ లో కొత్త గ్రూప్.. ఇప్పుడు అందరి టార్గెట్ వాళ్ళే..
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మరో కొత్త బ్యాచ్ పుట్టుకొచ్చింది. (Bigg Boss Telugu 10)
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మంచి రసవత్తరంగా సాగుతుంది. మొదటి రోజు నుంచే బిగ్ బాస్ లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వాళ్లలో ఒక్క ఝాన్సీ తప్ప అందరూ గ్రూపిజం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ లీడ్ తీసుకొని అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా ఒక్కటయి ఆడారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసారు. దీంతో సెలబ్రిటీలు అంతా అగ్నిపరీక్ష బ్యాచ్ పై ఫైర్ అయ్యారు. వాళ్ళు కూడా సెలబ్రిటీలు అంతా బ్యాచ్ గా ఆడుతున్నారు అని అన్నారు.
అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మరో కొత్త బ్యాచ్ పుట్టుకొచ్చింది. మొదటి నుంచి త్రిగున్ వెనక తిరిగి, సృష్టి విషయంలో త్రిగున్ సలహాలు తీసుకున్న సుధీర్ నామినేషన్స్ లో త్రిగున్ కి వెన్నుపోటు పొడిచాడు. ఇక మరోవైపు దేబ్జానీ ముకేశ్ ఇష్టం అని చెప్పడంతో ఆమెతో క్లోజ్ గా అంటూ రొమాంటిక్ డ్యాన్స్ లు కూడా వేసాడు ముకేశ్. కానీ ఇప్పుడు ముకేశ్, సుధీర్ వర్షిణి చేతిలో ఉన్నారు.
Also See : Ramya Pasupuleti : షార్ట్ డ్రెస్ లో తెలుగమ్మాయి అందాలు..రమ్య పసుపులేటి ఫొటోలు..
ఇటీవల వీకెండ్ ఎపిసోడ్ లో కూడా చాలా మంది వర్షిణి మ్యానిప్యులేటర్, సుధీర్ ఆమె పప్పెట్ అని చెప్పారు. ఈ రెండు రోజులు జరిగిన నామినేషన్స్ లో కూడా అందరూ అదే అన్నారు. వర్షిణి ఏమన్నా అంటే ముకేశ్ మధ్యలో వస్తున్నాడు. సుధీర్ ని ఏమన్నా అంటే వర్షిణి వస్తుంది. ముకేశ్ తనకు ఇష్టమైన దేబ్జానీ ని కూడా నిన్న టెంప్టేషన్ కోసం వెన్నుపోటు పొడిచి వర్షిణి ని సేవ్ చేసాడు. హౌస్ లో ఉన్నవాళ్ళంతా ఇప్పుడు వర్షిణి, ముకేశ్, సుధీర్ ఒక బ్యాచ్ అని, వర్షిణి చెప్పినట్టు మిగతా ఇద్దరూ నడుస్తున్నారని భావిస్తున్నారు. దీంతో అందరూ ఈ ముగ్గుర్ని టార్గెట్ చేసారు ప్రస్తుతం.
ఈ కొత్త బ్యాచ్ తో పాటు అగ్నిపరీక్ష బ్యాచ్ అలాగే ఉంది. తమ గ్రూపిజం ఇంకా చేస్తున్నారు. రామ్ ప్రసాద్, నరేష్ మొదటి నుంచి కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. త్రిగున్ మొదట సెలబ్రిటీలందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావాలి అనుకున్నాడు అగ్నిపరీక్ష బ్యాచ్ కి వ్యతిరేకంగా కానీ ఆడియో సాధ్యపడలేదు. ప్రస్తుతం వంశీ, త్రిగున్ ఇద్దరే కలిసి ఉంటున్నారు. ముందు ముందు బిగ్ బాస్ లో ఇంకెన్ని గ్రూప్స్ వస్తాయో చూడాలి.
