Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ డేట్ అనౌన్స్.. ఎప్పట్నించి అంటే.. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు?
తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టెలికాస్ట్ డేట్ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేసారు. (Bigg Boss 10)
Bigg Boss 10
Bigg Boss 10 : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ మొదలవుతుంది. తెలుగులో 9 సీజన్లు పూర్తి చేసుకొని పదో సీజన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా ఫైనల్ స్టేజికి కూడా వచ్చేసింది. ఈ సారి బిగ్ బాస్ 10కి కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నారు. తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టెలికాస్ట్ డేట్ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేసారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది. ఆ తర్వాత రోజు నుంచి వీక్ డేస్ రాత్రి 9 గంటల 30 నిమిషాలకు, వీకెండ్స్ శని, ఆది వారాలు రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవ్వనున్నాయి.
Also Read : King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..
ఈ సారి అగ్ని పరీక్ష నుంచి నలుగురు సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకొక వారం రోజులు ఎదురు చూడాల్సిందే.
