Janhvi Kapoor : వాట్.. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ మరీ అంత ఎక్కువా..? టాలీవుడ్‌లో అంత ఇస్తారా?

ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే పెట్టింది.

Janhvi Kapoor : వాట్.. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ మరీ అంత ఎక్కువా..? టాలీవుడ్‌లో అంత ఇస్తారా?

Bollywood Actress Janhvi Kapoor Remuneration in Tollywood goes Viral

Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా, బాలీవుడ్ భామగా జాన్వీ కపూర్ తెలుగు వాళ్లకి కూడా పరిచయం అయింది. తెలుగులో ఇంకా ఒక్క సినిమా కూడా చేయకుండానే తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో, తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ ఫాలోవర్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆల్రెడీ బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కొన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు కూడా కమర్షియల్ హిట్ కొట్టలేదు.

ప్రస్తుతం జాన్వీ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే పెట్టింది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దేవర సినిమాతో జాన్వీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టాలని చూస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్ RC16 సినిమాలో కూడా జాన్వీ నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా జాన్వీ కపూర్ పాల్గొని సందడి చేసింది.

Also Read : Palak Muchhal : మహేష్ బాబుని మించి.. ఈ సింగర్ చిన్నపిల్లలకు ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్.. ఇప్పటికే 3000 మందికి

తాజాగా జాన్వీ కపూర్ నాని సినిమాలో కూడా నటించబోతుందని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని సినిమాలో జాన్వీ హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి. ఇలా తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఆఫర్ల మీద ఆఫర్లు పట్టేస్తుంది ఈ భామ. అయితే ఇప్పుడు జాన్వీ రెమ్యునరేషన్ టాలీవుడ్ లో చర్చగా మారింది. సాధారణంగా మన దగ్గర బాలీవుడ్ తో పోలిస్తే రెమ్యునరేషన్స్ తక్కువే. ఇక్కడ హీరోయిన్స్ కి 2 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వరు. అది కూడా స్టార్ హీరోయిన్ అయితే తప్ప. కానీ బాలీవుడ్ లో హీరోయిన్స్ కి 2 కోట్ల నుంచి మొదలుపెట్టి 10 కోట్ల వరకు కూడా ఇస్తారు.

జాన్వీ కూడా టాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినప్పుడు తన బాలీవుడ్ రెమ్యునరేషన్ చెప్పి అందర్నీ భయపెట్టిందట. జాన్వీ ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అయితే ఇటీవల RC16 సినిమాకు 8 కోట్లు చెప్తే బేరసారాలు అన్ని అయిన తర్వాత మూడున్నర కోట్లకు ఫైనల్ అయిందని టాక్. అసలు ఒక్క సినిమా కూడా టాలీవుడ్ లో రిలీజ్ అవ్వకుండా హీరోయిన్ కి మూడున్నర కోట్లు ఇస్తున్నారంటే అది కేవలం జాన్వీ కే దక్కింది. శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్, సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇవన్నీ తమ సినిమాలకు కలిసొస్తాయని లెక్కలేసుకొని మరీ జాన్వీకి రెమ్యునరేషన్ బాగానే ఇస్తున్నారు. మరి జాన్వీ రెమ్యునరేషన్ తెలిసి మిగిలిన హీరోయిన్స్ ఏమంటారో చూడాలి.