Animal Movie : ఆమీర్ ఖాన్ ఓల్డ్ వీడియోతో ‘యానిమల్’ని ట్రోల్ చేస్తున్న బాలీవుడ్..

గతంలో ఆమీర్ ఖాన్ మాట్లాడిన ఓ ఓల్డ్ వీడియోతో బాలీవుడ్ ఆడియన్స్.. సందీప్ వంగని, యానిమల్ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఆమీర్ ఏం మాట్లాడంటే..

Animal Movie : ఆమీర్ ఖాన్ ఓల్డ్ వీడియోతో ‘యానిమల్’ని ట్రోల్ చేస్తున్న బాలీవుడ్..

Bollywood Audience troll Animal Movie with Aamir Khan old comments

Animal Movie : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన వైల్డ్ మూవీ ‘యానిమల్’. రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. నాన్న ఎమోషన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఓవర్ వియోలెన్స్ అండ్ బోల్డ్ సీన్స్ తో చాలా వైల్డ్ గా తెరకెక్కింది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో యూత్ లో రణబీర్ కి ఎంత క్రేజ్ వస్తుందో, సందీప్ వంగకి కూడా అంతే క్రేజ్ వస్తుంది.

మూవీని ఒక కల్ట్ బొమ్మగా తెరకెక్కించాడని కామెంట్స్ చేస్తూ సందీప్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు. రాజమౌళి సైతం సందీప్ ఒక పాత్ బ్రేకర్ అంటూ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆర్జీవీ, ఇప్పుడు సందీప్ అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సందీప్ వంగని, యానిమల్ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమీర్ ఖాన్ మాట్లాడిన ఓ ఓల్డ్ వీడియోని చూపిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Also read : Nithiin – Nani : నితిన్ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్.. అప్పుడు నితిన్‌ని, నాని ఏమని పిలిచేవాడో తెలుసా..?

ఇంతకీ ఆ వీడియో ఆమీర్ ఏం మాట్లాడంటే.. ఒక కథని క్రియేటివిటీగా చెప్పడం రాని డైరెక్టరే.. “ఎక్కువ వియోలెన్స్, సెక్స్ ని సినిమాల్లో చూపిస్తారు. ఎందుకంటే ఆడియన్స్ ని అది త్వరగా ఆకర్షించగలదు. ఆడియన్స్ కి అవి త్వరగా రీచ్ అవుతుంది” అంటూ ఓల్డ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కామెంట్స్ ని చూపిస్తూ యానిమల్ మూవీని ట్రోల్ చేస్తున్నారు. కొందరు టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆమీర్ మాటలని సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇక యానిమల్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లో కొత్త రికార్డుని సృష్టించింది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ త్రీ డేస్ కలెక్షన్స్ ని యానిమల్ బీట్ చేసింది. గ్లోబల్ వైడ్ వీకెండ్ కలెక్షన్స్ కూడా ఈ చిత్రం నెంబర్ వన్ గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by THYVIEW (@thyview)