Akshay Kumar : కష్టాల్లో ఉన్న ఆ సింగర్‌కు ఏకంగా 25 లక్షలు దానం చేసిన స్టార్ హీరో..

పంజాబ్ కు చెందిన సింగర్ గ్లోరీ బవా ఇటీవల తన సోషల్ మీడియాలో తాను చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాను అని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.

Akshay Kumar : కష్టాల్లో ఉన్న ఆ సింగర్‌కు ఏకంగా 25 లక్షలు దానం చేసిన స్టార్ హీరో..

Bollywood Star Hero Akshay Kumar Helped to Punjab Singer Glory Bawa

Akshay Kumar : మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి ఆదుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ సింగర్ కి ఏకంగా 25 లక్షలు దానం చేసాడు. పంజాబ్ కు చెందిన సింగర్ గ్లోరీ బవా ఇటీవల తన సోషల్ మీడియాలో తాను చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాను అని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. పంజాబ్ కి చెందిన గొప్ప సింగర్ గుర్మీత్ బవా కూతురు ఈ గ్లోరీ బవా. గుర్మీత్ కి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు కూడా ఇచ్చింది.

అయితే ఆమె తల్లి మరణించాకే గ్లోరీ బవా ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటుంది. గ్లోరీ బవా కూడా సింగర్ కావడంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం అక్షయ్ కుమార్ దాకా వెళ్లడంతో అక్షయ్ గ్లోరీ బవాకు ఏకంగా 25 లక్షలు సహాయం చేసాడు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. ఈ విషయం నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. గుర్మీత్ బవా పంజాబ్ లో గొప్ప సింగర్. ఆమె పాటలు నేను వినేవాడిని. ఆమె కూతురు ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉందని తెలిసి బాధపడ్డాను. అందుకే ఒక అన్నయ్యగా ఆమెకు సహాయం చేశాను అని తెలిపాడు.

Also Read : Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరేంటో తెలుసా?

ఇక అక్షయ్ కుమార్ చేసిన సహాయంపై గ్లోరీ బవా మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ చేసిన సహాయం నేను మర్చిపోలేను. మా అమ్మ పాటలు ఆయన విని ఉంటారు. అన్నయ్యగా నాకు ఈ సహాయం చేసానని తెలిపారు. నేను ఆయనకు రాఖీ కట్టి నిజంగానే అన్నయ్యని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో నా ఆర్ధిక కష్టాలు తీరిపోతాయి. నేను పని చేసుకొని బతుకుతాను అని తెలిపింది. దీంతో అక్షయ్ కుమార్ మంచి మనుసుని అందరూ అభినందిస్తున్నారు. అలాగే గ్లోరీ బవాకు పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కూడా లక్ష రూపాయలు సహాయం చేసారు.