Krishna Shroff : స్టార్ హీరో చెల్లి.. స్టార్ విలన్ కూతురు.. ఈ హాట్ భామ హీరోయిన్ అవుతుందా?

బాలీవుడ్ లో చాలా మంది స్టార్ నటీనటుల కూతుళ్లు, కొడుకులు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంకో పేరు వినిపిస్తుంది.

Krishna Shroff : స్టార్ హీరో చెల్లి.. స్టార్ విలన్ కూతురు.. ఈ హాట్ భామ హీరోయిన్ అవుతుందా?

Bollywood Star Jackie Shroff Daughter Tiger Shroff Sister Krishna Shroff going Viral

Updated On : July 21, 2024 / 12:23 PM IST

Krishna Shroff : ఇటీవల బాలీవుడ్ లో వారసులు, వారసురాళ్లు అందరూ సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్ నటీనటుల కూతుళ్లు, కొడుకులు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంకో పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు జాకీ ష్రాఫ్. తెలుగులో కూడా పంజా, శక్తి, సాహోతో పాటు పలు సినిమాల్లో నటించాడు. జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఆల్రెడీ బాలీవుడ్ లో స్టార్ హీరోగా దూకుసుకుపోతున్నాడు.

Also Read : Payal Malik – Arman Malik : ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. బిగ్‌బాస్ దెబ్బకి ఒక భార్య విడాకులు..

అయితే ఇప్పుడు జాకీ ష్రాఫ్ కూతురు, టైగర్ ష్రాఫ్ చెల్లి కృష్ణ ష్రాఫ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే కృష్ణ ష్రాఫ్ బిజినెస్ చేస్తూ, టీవీలో పలు షోలలో కనిపించి పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో ఇప్పటికే బోల్డంతమంది ఫాలోవర్స్ ని సాధించింది. కృష్ణ ష్రాఫ్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. అలాగే ఫిట్నెస్, జిమ్ కి సంబంధించిన బిజినెస్ లు చేస్తుంది. ఇప్పటికే పలు బిజినెస్ అవార్డులు కూడా అందుకుంది కృష్ణ.

అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు పెట్టే హాట్ హాట్ ఫోటోలు చూసి అన్న, నాన్న లాగే సినిమాల్లోకి వస్తుందా? హీరోయిన్ అవుతుందా అని చర్చించుకుంటున్నారు. కృష్ణ ష్రాఫ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. మరి ఈ అమ్మడికి బాలీవుడ్ లో ఏ నిర్మాత, దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. హీరోయిన్ అవ్వకుండానే స్టార్ డమ్ తెచ్చుకుంటుంది కృష్ణ ష్రాఫ్.