12th Fail : ’12th ఫెయిల్’ ఇప్పుడు తెలుగులో కూడా.. ఏ ఓటీటీలో తెలుసా..!

ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ చిత్రం ’12th ఫెయిల్’.. ఓటీటీలో తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో తెలుసా..!

12th Fail : ’12th ఫెయిల్’ ఇప్పుడు తెలుగులో కూడా.. ఏ ఓటీటీలో తెలుసా..!

Bollywood Super hit movie 12th fail now streaming in telugu ott details

12th Fail : ఇటీవల బాలీవుడ్ లో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ’12th ఫెయిల్’. ప్రముఖ IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మనోజ్ కుమార్ శర్మ పాత్రని ‘మీర్జాపూర్’ నటుడు ‘విక్రాంత్ మాస్సే’ పోషించారు. ఇక మనోజ్ కుమార్ సతీమణి, ఐఆర్‌ఎస్ ఆఫీసర్ శ్రద్ధ జోషి పాత్రని మేధ శంకర్ పోషించారు.

ఈ సినిమా హిట్ అవ్వడం కష్టమని రిలీజ్ కి ముందు ఎన్నో విమర్శలు అందుకుంది. కానీ రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 70 కోట్ల వరకు రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని చూసిన సౌత్ ఆడియన్స్.. ఇక్కడ భాషల్లో కూడా రిలీజ్ అయితే బాగుండని భావించారు.

Also read : NBK109 : బాలయ్య మూవీలో ఆ మలయాళ స్టార్ హీరో.. కాంబినేషన్ అదిరిపోయిందిగా..

ఇప్పుడు వారందరి కోసం 12th ఫెయిల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ ఆడియన్స్ ఉంటే.. ఈరోజే ఈ సినిమాని చూసేయండి.

కాగా ఇటీవల బాలీవుడ్ లో ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ సినిమా ఐదు అవార్డులను సొంతం చేసుకొని వారేవా అనిపించింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్.. ఇలా ఐదు క్యాటగిరీస్ లో ఈ సినిమా పురస్కారాలు అందుకొని మంచి కంటెంట్ ఉన్న సినిమా సత్తా ఎలా ఉంటుందో చూపింది.