టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైంకుఠ పురం న్యూ ఫిల్మ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. బుట్ట బొమ్మ..నన్ను సుట్టుకొంటివే..జిందగీకే ఆటబొమ్మై…జంట కట్టుకుంటివే..అంటూ ఉన్న ఈ రొమాంటిక్ సాంగ్..అభిమానులను అలరిస్తోంది. 2019, డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం విడుదలైన కొద్ది క్షణాల్లో వైరల్ అయిపోయింది. 4 లక్షల మందికి పైగా పాటను చూశారు.
పాటను రామజోగయ్య శాస్త్రీ రచించగా..అర్మాన్ మాలిక్ పాడారు. మ్యూజిక్‌ను థమన్ అందించారు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన..క్లిప్పింగ్స్‌తో సాంగ్ సాగింది. చివరిలో ఆర్మాన్ మాలిక్ పాట పాడుతూ కనిపించారు. తమన్ సంగీతం అందించిన సామజవరగమణ, రాములో రాములా..అనే పాటలు యూ ట్యూబ్‌లో నయా రికార్డ్స్ సాధించాయి.
మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా, టబు, జయరామ్, నవీదీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
* బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమా ద్వారా వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
* నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత బన్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు.
* మంచి కథతో ముందుకు రావాలని భావించాడు. అందులో భాగంగా త్రివిక్రమ్ కథకు ఒకే చెప్పాడు.
Read More : కొరఢా : సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై GST దాడులు
* ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్‌కు అ అక్షరం సెంటిమెంట్ ఉంది. అల.. వైకుంఠపురములో అని సినిమాకు పేరు పెట్టారు.
* ఈ సినిమాలో హీరోయిన్ పేరు అలకనంద అని అందుకే ఆమె పేరులో అల.. ఆమె ఉండే ఇంటి పేరు వైకుంఠపురం అని, రెండూ కలిసి వచ్చేలా పేరు వచ్చేలా పెట్టినట్లు తెలుస్తోంది.
* సినిమా కోసం క్వీటో డైట్‌తో బన్నీ ఏకంగా 14 కిలోల బరువు తగ్గాడంట.
ButtaBomma Song out now … I personally really like this melody . Hope you like it too …. #AlaVaikunthapurramuloo
#ButtaBomma https://t.co/dDDYORIH5s
— Allu Arjun (@alluarjun) December 24, 2019