Premalatha Vijayakanth : భర్త మరణం తర్వాత విజయ్‌కాంత్ భార్య ఏం చేసిందో తెలుసా?

విజయ్ కాంత్ మరణం తర్వాత తాజాగా ఆయన భార్య ప్రేమలత చేసిన పని వైరల్ గా మారింది.

Premalatha Vijayakanth : భర్త మరణం తర్వాత విజయ్‌కాంత్ భార్య ఏం చేసిందో తెలుసా?

Captain Vijayakanth Wife Premalatha Tattooed her husbands face on Hand video goes viral

Premalatha Vijayakanth : ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, రాజకీయ నేత, దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ గత ఏడాది డిసెంబర్ 28న ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఎన్నో సినిమాలతో స్టార్ హీరోగా నిలిచిన విజయ్ కాంత్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే మరణానంతరం విజయ్ కాంత్ కి కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.

Also Read : Upasana : నేను, చరణ్.. ఇద్దరం ఇక్కడే పుట్టాం.. మా ఇద్దరికీ ఈ సిటీ అంటే చాలా ఇష్టం.. ఏ సిటీనో తెలుసా?

విజయ్ కాంత్ మరణం తర్వాత తాజాగా ఆయన భార్య ప్రేమలత చేసిన పని వైరల్ గా మారింది. ప్రేమలత తన కుడి చేతి మీద విజయ్ కాంత్ ముఖాన్ని టాటూగా వేయించుకుంది. తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని ఆ టాటూ వేయించుకున్నట్టు చెప్పింది. ప్రేమలత టాటూ వేయించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు ఆమెని అభినందిస్తున్నారు.

Vijayakanth