Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో రూ.9 కోట్ల మోసం.. బిగ్ బాస్ అషు రెడ్డిపై కేసు నమోదు
లవ్ అండ్ మనీ స్కామ్ లో బిగ్ బాస్ ఆషు రెడ్డి(Ashu Reddy)పై కేసు నమోదు.
Case Registered Against Ashu Reddy in Love and Money Scam
Ashu Reddy: తెలుగు రియాలిటీ షోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అషు రెడ్డి(Ashu Reddy) భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ.9 కోట్ల రూపాయల మేర ఆస్తులు, నగదు కాజేసినట్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో కేసు నమోదైంది. 2018లో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారిందని, సినిమాల్లో రాణించేందుకు ఆర్థిక సాయం కావాలని ఆమె కోరడంతో బాధితుడు పెద్ద మొత్తంలో డబ్బు పంపినట్లు సమాచారం.
Nainika Anasuru: ఢీ డాన్సర్ నైనికా అనసూరు.. రెడ్ డ్రెస్సులో అందాల రచ్చ లేపుతోందిగా.. ఫొటోలు
బాధితుడి తండ్రి సత్యనారాయణ అందించిన ఫిర్యాదు ప్రకారం, గత ఏడేళ్లలో అషు రెడ్డి వివిధ దఫాలుగా దాదాపు రూ.9 కోట్ల రూపాయలకు పైగా నగదుతో పాటు 5 కిలోల బంగారాన్ని కూడా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, బాధితుడు పంపిన సొమ్ముతో ఆమె తన పేరు మీద ఖరీదైన ఫ్లాట్లు, కారు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి విషయంపై ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించడంతో, మోసపోయామని గ్రహించిన బాధితుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అషు రెడ్డి బ్యాంక్ ఖాతాలను, ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది. గతంలో డ్రగ్స్ కేసు నిందితుడితో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొన్న అషు రెడ్డికి, ఈ తాజా ‘లవ్ అండ్ మనీ’ స్కామ్ పెద్ద తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఆమె, ఈ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
