టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు.