×
Ad

బస్తీ బాలరాజుకి చావు ఇంట్లో ప్రేమ పుట్టిందండీ..

  • Published On : March 5, 2021 / 08:19 PM IST

Chaavu Kaburu Challaga Trailer: కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా.. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. శుక్రవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. కార్తికేయ బస్తీ బాలరాజు మాస్ క్యారెక్టర్‌లో చాలా బాగా చేశాడు. అతని ప్రేయసిగా నర్స్ పాత్రలో లావణ్య కనిపించింది.

ఆమని, రావు రమేష్, భద్రం, ప్రభు తదితరులు కీలకపాత్రల్లో నటించిన ‘చావు కబురు చల్లగా’ లో యాంకర్ అనసూయ మాస్ ఆడియెన్స్‌ని మైమరపించడానికి మాంచి మాస్ మసాలా సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 19న సినిమా విడుదలవుతోంది.