Paarijatha Parvam : ఆహా ఓటీటీలోకి వచ్చేసిన పారిజాత పర్వం..

పారిజాత పర్వం సినిమా ప్రస్తుతం నేడు జూన్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Paarijatha Parvam : ఆహా ఓటీటీలోకి వచ్చేసిన పారిజాత పర్వం..

Chaithanya Rao Sunil Shraddha Das Paarijatha Parvam Movie Streaming in Aha OTT

Paarijatha Parvam : చైతన్య రావు, సునీల్(Sunil), శ్రద్ధా దాస్(Shraddha Das), మాళవికా సతీశన్, వైవా హర్ష.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా పారిజాత పర్వం. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. క్రైం కామెడీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. పారిజాత పర్వం సినిమా ప్రస్తుతం నేడు జూన్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కూడా ఆహా ఓటీటీలో పారిజాత పర్వం సినిమా చూసేయండి.

Also Read : Ram Charan – Brahmani : బాలయ్య కూతురితో మెగాస్టార్ తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక ఈ పారిజాత పర్వం సినిమా కథ విషయానికొస్తే.. చిరంజీవి ఫ్యాన్ శ్రీను(సునీల్) హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వస్తాడు. ఇక్కడ రియాల్టీ అర్థమయి బార్ లో పని చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉండగా ఆ బార్ డ్యాన్సర్ పారు(శ్రద్ధ దాస్)ని బార్ ఓనర్ నుంచి రక్షించబోయి అతన్ని చంపేసి డాన్ అవుతాడు. ఇదే బార్ శ్రీను కథని సినిమా కథగా రాసుకొని చైతన్య(చైతన్య కృష్ణ) దర్శకుడిగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కథ నిర్మాతలకు నచ్చినా హీరోగా తన ఫ్రెండ్(హర్ష)నే కావాలి అనడంతో వచ్చిన ఛాన్సులు కూడా పోతాయి. ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని చైతన్య తనని అవమానించిన ప్రొడ్యూసర్ భార్యని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగి వాటితో సినిమా తీయాలనుకుంటాడు. అదే సమయంలో బార్ శ్రీను మనుషులు కూడా ఆ ప్రొడ్యూసర్ భార్యని కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరి ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారు? చైతన్య సినిమా తీసాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.