Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ కోసం 13 సెట్లు.. విశ్వం అంతా కనపడేలా..

చిరంజీవి ఈ సారి చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాడని తెలుస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది.

Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ కోసం 13 సెట్లు.. విశ్వం అంతా కనపడేలా..

Chiranjeevi Vishwambhara Movie Universe Design Set Work Going in Hyderabad

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠ(Director Vassishta) దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా అందర్నీ ఆశ్చర్యపరిచి మెప్పించింది. మొదటి నుంచి కూడా ఈ సినిమా బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా చిరంజీవి లేని సీన్స్ మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఫిబ్రవరిలో చిరంజీవి ఈ సినిమా షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో దాదాపు 13 సెట్స్ నిర్మిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. విశ్వం అంతా కనపడే సెట్స్ వేస్తున్నట్టు సమాచారం.

Also Read : Vijay Devarakonda : ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పీరెన్స్..? ఆ స్టార్ హీరో, డైరెక్టర్ కూడా..

దీంతో విశ్వంభర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. చిరంజీవి ఈ సారి చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాడని తెలుస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో VFX వర్క్స్ చాలా ఉన్నాయి. విశ్వంభర విజువల్ వండర్ లా ఉండబోతుంది. ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.