Rathnavelu : ఎన్టీఆర్ హైట్ పై సినిమాటోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే ‘దేవర’లో అలా..
దాంతో రత్నవేలు పెద్ది గురించి చెప్తూనే దేవర గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. (Rathnavelu)
Rathnavelu
Rathnavelu : ఇటీవల సోషల్ మీడియాలో ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోని ట్రోల్ చేయడం మరీ ఎక్కువైంది. ఎన్టీఆర్ విషయంలో హైట్ ని కూడా ప్రస్తావిస్తూ కొంతమంది ట్రోల్ చేస్తారు. అయితే ఇటీవల దేవర సినిమాలో తమ హీరో ఎన్టీఆర్ ని కొన్ని చోట్ల హైట్ తక్కువగా కనిపించేలా చూపించారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని ట్రోల్ చేసారు.
తాజాగా పెద్ది సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా రత్నవేలు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. హోస్ట్ ఈ సినిమాలో చరణ్ బాడీని అంత పవర్ ఫుల్ గా చూపించడానికి మీరు తీసుకున్న టెక్నిక్స్ ఏంటి అని అడిగారు. దాంతో రత్నవేలు పెద్ది గురించి చెప్తూనే దేవర గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Mohan Babu : పవన్ కళ్యాణ్‌తో వివాదం.. 19 ఏళ్ళ తర్వాత స్పందించిన మోహన్ బాబు.. ఏమన్నారంటే..
రత్నవేలు మాట్లాడుతూ.. చరణ్ కి ఏ యాంగిల్, ఏ ప్రొఫైల్ పెట్టాలి నాకు తెలుసు. అతనితో ఎప్పట్నుంచో పనిచేస్తున్నా కాబట్టి. అలాగే హీరోని ఎలా చూపించాలి అనేది ఎడిటింగ్ లో కూడా ఉంటుంది. టామ్ క్రూజ్ కూడా కొంచెం హైట్ తక్కువ ఉంటారు కానీ సినిమాటోగ్రఫీలో మేనేజ్ చేస్తారు. దేవర సినిమాలో నేను మంచి యాంగిల్స్ పెట్టి చూపించే ప్రయత్నం చేశాను. వైడ్ యాంగిల్స్ లో సీన్ చూపించేటప్పుడు హీరో కంటే ఎక్కువ పొడవు ఉన్నవాళ్లు పక్కన ఉంటే హీరో పొట్టిగా కనిపిస్తాడు.
ఎన్టీఆర్ ని హైట్ గా చూపించాలి అంటే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నవాళ్లు ఎక్కువ హైట్ ఉండకూడదు. అది కూడా ఇంపార్టెంట్. దేవరలో కూడా నేను చెప్పాను ఎక్కువ పొడవు ఉన్నవాళ్లను పెట్టొద్దు అని. కానీ అక్కడ అందరు బీస్ట్ లా ఉండేవాళ్ళను పెట్టారు. మేము మంచి అవుట్ పుట్ కోసం చెప్తే అది అందరూ ఫాలో అవ్వాలి. ఫాలో చెయ్యకపోతే మేము ఏం చేస్తాం. మేము వద్దన్నా వైడ్ షాట్ లో కూడా సీన్ కావాలి అంటే చేస్తాము. దాన్ని ఎడిటింగ్ లో ఎక్కువ సేపు చూపించకూడదు అని అన్నారు.
Also Read : Peddi 9 Days Collection: సరికొత్త రికార్డు సెట్ చేసిన పెద్ది.. సౌత్ ఇండియాలోనే..
దేవర సినిమాపై, ఎన్టీఆర్ హైట్ పై, డైరెక్టర్ కొరటాల శివ తాను చెప్పింది వినలేదని ఇండైరెక్ట్ గా రత్నవేలు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
