Comedian Prudhvi Raj : అంబటి రాంబాబు ఎవరో నాకు తెలీదు.. ‘బ్రో’ సినిమా శ్యాంబాబు వివాదంపై పృథ్వి కామెంట్స్ వైరల్..

తాజాగా బ్రో సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ ఈ శ్యాంబాబు ఇష్యూ గురించి కూడా మాట్లాడాడు.

Comedian Prudhvi Raj sensational comments on Ambati Rambabu in Bro Movie Success Meet

Comedian Prudhvi Raj :  ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్(Sai Dharam Tej) క‌లిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా ఇటీవల జులై 28న రిలీజయి భారీ హిట్ కొట్టింది, ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. జనసేనకు సింక్ అయ్యేలా కూడా ఓ రెండు సీన్స్ పెట్టారు ఈ సినిమాలో. అయితే బ్రో మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ ‘శ్యాంబాబు’ అనే పాత్రని పోషించాడు. ఒక నిమిషం పాటు ఈ శ్యాంబాబు పాత్ర కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి కౌంటర్ అని అర్ధమవుతుంది.

గతంలో సంక్రాంతికి అంబటి రాంబాబు బయట రోడ్డు మీద డ్యాన్స్ వేస్తాడు. అదే డ్యాన్స్, అదే డ్రెస్ వేయించి పృథ్వీతో సినిమాలో చేయించారు. పవన్ ఆ క్యారెక్టర్ ని డ్యాన్స్ కూడా రాదా అంటూ తిడతాడు. దీంతో అంబటి డ్యాన్స్ వీడియో, పృద్వి వీడియో లింక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. ఈ మూవీలో శ్యాంబాబుగా అంబటి రాంబాబు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడంతో ఈ సీన్ అంబటి రాంబాబు దాకా వెళ్లగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని తిట్టారు రాంబాబు. ట్విట్టర్ లో కూడా పవన్ కి కౌంటర్లు వేశారు.

తాజాగా బ్రో సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ ఈ శ్యాంబాబు ఇష్యూ గురించి కూడా మాట్లాడాడు. పృథ్వీ మాట్లాడుతూ.. సముద్రఖని గారు పిలిచి నాకు సినిమా ఇచ్చారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయి నాకు మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది. పవన్ గారితో మూడు సినిమాలు చేసాను. ఇది నాలుగోది. ఈ సినిమాలో సముద్రఖని గారు జీవితం పై మంచి మెసేజ్ ఇస్తే అది వదిలేసి నా క్యారెక్టర్ ని పట్టుకున్నారు. నన్ను ఆ సినిమా రిలీజ్ దగ్గర నుంచి అందరూ అడుగుతున్నారు అది మంత్రి రాంబాబు క్యారెక్టర్ కదా, మంత్రి గారిని డీగ్రేడ్ చేశారని అంటున్నారు. నేను ఒకటే చెప్పాను.. రాంబాబు ఎవరో నాకు తెలీదు. అతనేమీ ఆస్కార్ నటుడు కాదు అతన్ని ఇమిటేట్ చేయడానికి. నాకు సముద్రఖని గారు పిలిచి.. ఒక పనికిమాలిన వెధవ, బారుల్లో పడి తాగుతూ తిరుగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు అనే క్యారెక్టర్ చెప్పారు. నేను నటుడ్ని కాబట్టి చేస్తాను. ఆ సీన్ చేసేటప్పుడు కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ శ్యాంబాబు పాత్ర బాగా పేలింది కాబట్టి భవిష్యత్తులో నాకు ఇలాంటి శ్యాంబాబు క్యారెక్టర్స్, అవకాశాలు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Bro Collections : 100 కోట్లు దాటేసిన ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్‌లోనే అత్యంత ఫాస్ట్‌గా..

అయితే పృథ్వి గతంలో వైసీపీలో ఉండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఎవరో తెలీదు అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి దీనిపై అంబటి రాంబాబు ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.