Sudharshan : తిండితిప్పలు లేకుండా రోజంతా వర్షంలో.. అయినా కూడా.. ఈ కమెడియన్ ప్రభాస్ కి ఇంత పెద్ద అభిమానా?
ప్రభాస్ ని ఆర్టిస్ట్ అయ్యాక కూడా ఇప్పటిదాకా కలవలేదంట. (Sudharshan)
Sudharshan
Sudharshan : షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నెల్లూరు సుదర్శన్ ఇప్పుడు కమెడియన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను నటించిన కపుల్ ఫ్రెండ్లీ, హే భగవాన్ సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు సుదర్శన్. ఈ క్రమంలో తాను ప్రభాస్ కి ఎంత పెద్ద అభిమానో చెప్పుకొచ్చాడు.(Sudharshan)
Also Read : Santosh Soban : ఎక్కడున్నావమ్మా..? స్కూల్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న సంతోష్ శోభన్.. పేరు చెప్పి..
సుదర్శన్ మాట్లాడుతూ.. నేను ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ ని. ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్స్ లో కూడా ఉండేవాడిని. మిర్చి సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఎక్కడున్నా ఇంటికి వస్తాడని అందరూ అనుకునేవాళ్లు ఫ్యాన్స్. ప్రభాస్ పుట్టిన రోజు నాడు మేము ఆయన ఇంటికి వెళ్లి వాళ్ళింటి ముందు ఓ చెట్టు ఉంటుంది నేను ఇంకో ఫ్రెండ్ ఆ చెట్టు కింద నిలబడ్డాం. ఉదయం 6 గంటలకు వెళ్ళాం. ఫ్యాన్స్ చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు. ప్రభాస్ లేడు అని చెప్పినా మేము వినకుండా అలాగే నిలబడి ఉన్నాం.
టిఫిన్, లంచ్, డిన్నర్ ఏమి తినకుండా అలాగే చెట్టు కింద నిలబడ్డాం. ఇంకోవైపు వర్షం. వర్షంలో తడుస్తూ తిండి లేకుండా రోజంతా అక్కడే ఉన్నాం. రాత్రి ఒంటిగంట వరకు ఉన్నాం. అప్పుడు వాచ్ మెన్ తో మాట్లాడుతుంటే లోపల్నుంచి ఒక మేనేజర్ వచ్చి పిలిచారు. ఇంకేముంది ప్రభాస్ ని కలుస్తాం అనుకున్నాం. లోపలికి వెళ్ళాక ఒక చైర్ మీద కేక్ పెట్టి కట్ చేయించి ఆ కేక్ నాకు తినిపించి ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు ప్రభాస్ గారు వచ్చాక చూపిస్తాము, ఆయన ఇక్కడ లేరు మీరు వెళ్ళండి అన్నా కూడా మేము వినలేదు. ఆ రోజు ఆయన రాలేదు. తర్వాత హీరోలను, ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకూడదని నేను ఆర్టిస్ట్ అయ్యాక తెలిసింది అని అన్నారు.
Also See : Vishwak Sen : చంద్రన్న కోసం బండ్లన్న చేస్తున్న పాదయాత్రలో విశ్వక్ సేన్.. ఫొటోలు..
అయితే ప్రభాస్ ని ఆర్టిస్ట్ అయ్యాక కూడా ఇప్పటిదాకా కలవలేదంట. దీని గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ గారిని ఇప్పటిదాకా కూడా కలవలేదు. చాలా సార్లు అవకాశం వచ్చి పోయింది. ఇప్పుడైతే ఆయనతో ఏదో ఒక సినిమా చేస్తాను షూటింగ్ సెట్ లో కలుద్దాము అని ఫిక్స్ అయ్యాను. రాజాసాబ్ లో కూడా ఛాన్స్ వచ్చి పోయింది. వేరే షూటింగ్ కి కమిట్మెంట్ ఇవ్వడంతో రాజాసాబ్ ఛాన్స్ పోయింది అని తెలిపాడు. దీంతో సుదర్శన్ ప్రభాస్ కి ఇంత పెద్ద వీరాభిమానా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక సుదర్శన్ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
