వైరల్ అవుతున్న హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు

  • Publish Date - January 2, 2020 / 04:41 AM IST

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే తాజాగా తన అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసింది. వాటికి ‘ప్రతి  ఆలోచనలో, పనిలో స్పష్టత కలిగి ఉండాలి. హ్యాపీ 2020’ అనే క్యాప్షన్‌ పెట్టింది. 

ఇక దీపికా షేర్ చేసిన ఫోటో ఎప్పటిదో తెలుసా..? తను చదువుకునే రోజుల్లో ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో పార్టిసిపేట్ చేసినప్పటిది. ఇందులో దీపికా మీసంతో.. తెలుపురంగు చీరలో కనిపిస్తోంది. ఇక దీపికా ప్రస్తుతం మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ‘ఛపాక్’ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉంది.

2005లో ఢిల్లీలో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా (జనవరి 10, 2020)న విడుదల కానుంది. సినిమా పైన అందరికి మంచి అంచనాలు ఉన్నాయి. 

ట్రెండింగ్ వార్తలు