Deverakonda Family : మూడు నెలలు దేవరకొండ ఫ్యామిలీవే.. ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చిన విజయ్ దేవరకొండ..
ఈ ముగ్గురూ వరుస పెట్టి తమ సినిమాలతో రాబోతున్నారు. (Deverakonda Family)
Deverakonda Family
Deverakonda Family : ఇప్పుడు దేవరకొండ ఫ్యామిలిలో విజయ్, రష్మిక, ఆనంద్.. ఇలా ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అయితే ఈ ముగ్గురూ వరుస పెట్టి తమ సినిమాలతో రాబోతున్నారు.
ఆనంద్ దేవరకొండ ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. రష్మిక మందన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా మైసా నవంబర్ 27న రిలీజ్ కానుంది. ఇలా మూడు నెలలు నెలకు ఒకరు తమ సినిమాలతో రాబోతున్నారు. ఒక సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్స్, ప్రెస్ మీట్స్, టీజర్, ట్రైలర్.. ఇలా కనీసం ఒక రెండు మూడు వారాలు ఆ సినిమా, సినిమా నటీనటులు జనాల్లోనే ఉంటారు. దీంతో ఈ మూడు నెలలు దేవరకొండ ఫ్యామిలీ మొత్తం జనాల్లో, ఫ్యాన్స్ తో, మీడియాలో సందడి చేయనున్నారు.
Also See : Rashmika Mandanna : పాత క్యూట్ ఫోటోలను షేర్ చేసిన రష్మిక.. మా టీమ్ తీసిన ఫొటోలు అంటూ..
తాజాగా జరిగిన ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడు. నెక్స్ట్ మంత్ రణబాలి తో నేను వస్తా. తర్వాత మైసా తో దేవరకొండ రష్మిక వస్తుంది. మూడు నెలలు మనవే. ఈ మూడు నెలలు నా రౌడీ బాయ్స్, గర్ల్స్ మధ్యే ఉంటాము అని అన్నారు. దీంతో ఈ మూడు నెలలు దేవరకొండ ఫ్యామిలీకి చాలా కీలకం అని తెలుస్తుంది.
