Dhanush : మళ్ళీ ధనుష్ తెలుగు సినిమా.. హిట్ ఇచ్చిన దర్శకుడితోనే..
ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో ఇప్పటికే తెలుగులో డైరెక్ట్ గా సర్, కుబేర సినిమాలు చేసాడు. (Dhanush)
Dhanush
Dhanush : తమిళ్ స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి మార్కెట్ ఉంది. ధనుష్ అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ అవుతుంటాయి. ధనుష్ త్వరలో కర అనే సినిమాతో రాబోతున్నాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా రానుంది. ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో ఇప్పటికే తెలుగులో డైరెక్ట్ గా సర్, కుబేర సినిమాలు చేసాడు.
సర్, కుబేర.. రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మరోసారి డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. కర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా హాజరయ్యాడు.
Also Read : Shivathmika Rajashekar : ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ లో శివాత్మిక.. లీక్ చేసిన నటి.. ఫోటో వైరల్..
ఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. వెంకీ నువ్వు నాకు ఒక కథ చెప్పావు, ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. ఆ కథనే తీసుకురా. ఆ కథని చేద్దాం, నేను వెయిట్ చేస్తున్నాను అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా తనకు సర్ సినిమాతో హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో మరో సినిమా ధనుష్ కచ్చితంగా చేస్తాడని తెలుస్తుంది. వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య తో విశ్వనాధ్ & సన్స్ అనే సినిమా చేస్తున్నాడు.
