RajaSaab : వామ్మో.. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా ఒక్క రోజు బడ్జెట్ మరీ అంతా..? సినిమా బడ్జెట్ చెప్పిన డైరెక్టర్ మారుతి..

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది.

RajaSaab : వామ్మో.. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా ఒక్క రోజు బడ్జెట్ మరీ అంతా..? సినిమా బడ్జెట్ చెప్పిన డైరెక్టర్ మారుతి..

Director Maruthi Revealed Prabhas Raja Saab Movie Single Day Budget

RajaSaab : ప్రభాస్(Prabhas) గత సంవత్సరం సలార్ సినిమాతో వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాలు కల్కి, రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి సినిమా మేలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఎన్నికలు రావడంతో ఈ సినిమా వాయిదాపడింది. దీంతో మిగతా సినిమాలు వాయిదా తప్పదు. అయితే ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు. ఇందులో రాజాసాబ్ ఒక్కటే కొంచెం తక్కువ బడ్జెట్, ఎంటర్టైన్మెంట్ సినిమా అని సమాచారం.

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని సమాచారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని తీసుకొస్తారని గతంలో మారుతి తెలిపాడు. తాజాగా మారుతి ఓ సినిమా ప్రెస్ మీట్లో రాజా సాబ్ గురించి మాట్లాడారు.

Also Read : Swamy Ra Ra : ‘స్వామిరారా’ సినిమాకు కూడా సీక్వెల్..? ఆసక్తికర పోస్ట్ చేసిన హీరో నిఖిల్..

డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’ సినిమాని 30 లక్షల బడ్జెట్ తో తీశాను. కానీ ఇటీవల ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్లు ఖర్చు అయింది షూటింగ్ కి. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్ లో కనీసం నేను రెండు మూడు సినిమాలు తీసేవాడిని అని అన్నారు. దీంతో రాజాసాబ్ సినిమాని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తుంది. ఏకంగా ఆరోజుకి ఒక కోటి ఖర్చు అవుతుంది అంటే ప్రభాస్ రెమ్యునరేషన్ కాకుండా ఆ సినిమా బడ్జెట్ ఈజీగా 100 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ఆ రేంజ్ బడ్జెట్ లో లవ్ ఎంటర్టైనర్ తీస్తున్నారంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇక రాజాసాబ్ నుంచి ఆల్రెడీ ప్రభాస్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.

 

Image