Director Shankar : సత్తా చూపిస్తానంటున్న డైరెక్టర్‌ శంకర్‌..?

ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన భారతీయుడు-2 మూవీ నిరాశ ప‌రిచింది.

Director Shankar : సత్తా చూపిస్తానంటున్న డైరెక్టర్‌ శంకర్‌..?

Director Shankar wants to show his ability

ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన భారతీయుడు-2 మూవీ నిరాశ ప‌రిచింది. అయిన‌ప్ప‌టికీ ఆ చిత్ర ద‌ర్శ‌కుడు శంకర్‌ మాత్రం నిరూత్సాహ పడలేదట. దక్షిణభారత్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌గా శంకర్‌కు ఉన్న బ్రాండ్‌ ఒక్క చిత్రంతో చెరిగిపోదని అంటున్నారట. మూడు భారీ చిత్రాలను ఒకే సారి ప్లాన్‌ చేయడం వల్ల భారతీయుడు డిజాస్టర్‌గా మారిందని భావిస్తున్న దర్శకుడు శంకర్‌. త్వరలో ఓ సరికొత్త సినిమాతో తన సత్తా నిరూపిస్తానని చెబుతున్నాడట. అంటే డైరెక్టర్‌ శంకర్‌ నేతృత్వంలో మరో కొత్తసినిమా రాబోతుందని ఇండస్ట్రీకి హింట్‌ ఇచ్చినట్లేనంటున్నారు.

భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు శంకర్. ఇప్పుడందరూ పెద్ద పెద్ద బడ్జెట్లో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ.. నైన్‌టీస్‌లోనే భారీ బడ్జెట్‌ సినిమాలను తెరకెక్కించిన చరిత్ర శంకర్‌ది… ఇక ఆయన తాజాగా దర్శకత్వం వహించిన భారతీయుడు-2 కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్‌గా రెండు సినిమాలు తీయాలని నిర్ణయించిన శంకర్‌.. ఈ నెల 12న భారతీయుడు-2ను రిలీజ్‌ చేశారు. ఇక రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న గేమ్‌ఛేంజర్‌ సినిమాకు కూడా దర్శకత్వం చేస్తున్న శంకర్‌.. ఇదే సమయంలో భారతీయుడు-3కి ప్లాన్‌ చేశారు.

Janhvi Kapoor hospitalised : ఆస్ప‌త్రిలో చేరిన ‘దేవ‌ర’ భామ‌.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

ఇలా ఒకేసారి మూడు భారీ బడ్జెట్‌ సినిమాలకు ప్లాన్‌ చేయడంతోనే భారతీయుడు-2 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిందని చెబుతున్నారు. మరోవైపు భారతీయుడు-3, గేమ్‌ఛేంజర్‌ ఎలా ఉంటాయోననే టెన్షన్‌ మొదలైంది. ఐతే ఆ రెండు సినిమాలు ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటాయని చెబుతున్నారు శంకర్‌ టీం టెక్నీషియన్స్‌.

రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్‌ఛేంజర్‌పై ఎక్కువగా ఫోకస్‌ చేయడం వల్ల భారతీయుడు-2పై పెద్దగా దృష్టిపెట్టలేకపోయాడని అంటున్నారు. ఐతే శంకర్‌ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా తన పని తాను చేసుకుపోతున్న శంకర్ తర్వాత చెయ్యబోయే సినిమాపై పెద్ద ట్విస్టే ఇచ్చాడు. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్, భారీ సెట్స్, భారీ తారాగాణం ఉంటాయి. కానీ, గేమ్ చేంజర్, భారతీయుడు 3 తర్వాత శంకర్ చేసే ప్రాజెక్ట్ చాలా చిన్నదని సమాచారం.

Mechanic Rocky : థియేట‌ర్ల‌లో దీపావ‌ళి మోతె అంటున్న విశ్వ‌క్ సేన్‌.. మెకానిక్ రాకీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

పూర్తిగా కొత్త నటీనటులు, టెక్నీషియన్స్‌తో చాలా తక్కువ బడ్జెట్‌తో ఓ సినిమా చేయబోతున్నారని కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. శంకర్ సినిమా అంటే దాదాపు 250 నుంచి 500 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే.. కానీ కొత్త నటులతో శంకర్‌ ప్లాన్‌ చేస్తున్న సినిమా బడ్జెట్ కేవలం 50 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. తక్కువ బడ్జెట్‌తో పెద్ద హిట్ కొట్టి చూపిస్తానంటున్నాడు శంకర్‌. భారతీయుడు-2 నిరాశ పరిచిందని తనను ట్రోల్‌ చేస్తున్నవారికి సక్సెస్‌తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడట శంకర్‌.. అందుకే ఆయన అభిమానులు అంతా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.